టక్కర్ కలక్షన్స్ అంతేనా..?

సిద్ధార్థ్ ( Siddharth )హీరో అంటే అప్పట్లో చాలా మంచి సినిమాలు వచ్చేవి కానీ ఇప్పుడు ఆయన వరస సినిమాలు చేస్తున్నప్పటికీ అవేవీ పెద్దగా క్లిక్ అవ్వడం లేదు అందులో భాగంగా వచ్చిన సినియామే టక్కర్.

సిద్దార్థ్ హీరోగా, దివ్యాంశ కౌశిక్( Divyansha Kaushik ) హీరోయిన్ గా రూపొందిన ఈ మూవీ కి కార్తీక్ జి.

క్రిష్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.ఈ చిత్రాన్ని ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ బ్యానర్ పై ‘అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్’, ‘పాషన్ స్టూడియోస్’ తో కలిసి టి.జి విశ్వప్రసాద్ నిర్మించారు.వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరించారు.

జూన్ 9న తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం విడుదలైంది.టీజర్, ట్రైలర్, సాంగ్స్ ఓకే అనిపించాయి.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ( People Media Factory )’ వంటి బడా సంస్థ ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేయడంతో సిద్దార్థ్ కు ఓ హిట్ పడటం గ్యారెంటీ అని అంతా భావించారు.

Advertisement

కానీ మొదటి రోజు ఈ సినిమాకి నెగిటివ్ టాక్ వచ్చింది.దీంతో ఓపెనింగ్స్ ఏమాత్రం ఆశించిన స్థాయిలో నమోదు కాలేదు.రెండో రోజు , మూడో రోజు అయిన ఆదివారం రోజు కూడా అదే పరిస్థితి.ఒకసారి ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 0.30 cr సీడెడ్ 0.19 cr ఆంధ్ర 0.28 cr ఏపీ+ తెలంగాణ టోటల్ 0.77 cr ‘టక్కర్’ (Takkar) చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో రూ.2.5 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది.ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.2.75 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.మొదటి వీకెండ్ పూర్తయ్యేసరికి కేవలం రూ.0.67 కోట్ల షేర్ మాత్రమే నమోదైంది.ఆదివారం హాలిడే అడ్వాంటేజ్ ను కూడా ఈ మూవీ వాడుకోలేకపోయింది.

బ్రేక్ ఈవెన్ అయితే ఇక కష్టమే.ఫైనల్ గా ఎంతవరకు కలెక్ట్ చేస్తుందో చూడాలి.

Felix Spin — Die Besten Spiele Und Slots Im Vergleich
Advertisement

తాజా వార్తలు