నిత్యం ఈ పొడిని తీసుకుంటే బలహీనత నుంచి నిద్రలేమి వరకు అనేక సమస్యలు పరార్!

ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు.ఆరోగ్యం సరిగ్గా లేకపోతే ఎంత సంపద ఉన్నా మనశ్శాంతి మాత్రం దొరకదు.

అందుకే ప్రతి ఒక్కరూ ఆరోగ్యమైన జీవితాన్ని కోరుకుంటారు.హెల్తీ గా, ఫిట్ గా ఉండడం కోసం పోషకాలతో కూడిన ఆహారాలను డైట్ లో చేర్చుకుంటారు.

అయితే ఇప్పుడు చెప్పబోయే పొడి కూడా మీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.బలహీనత నుండి నిద్రలేమి వరకు అనేక సమస్యలను ఈ పొడి తరిమి కొడుతుంది.

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ పొడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని అందులో ఒక చిన్న కప్పు గుమ్మడి గింజలు( Pumpkin Seeds ) వేసి దోరగా వేయించుకోవాలి.

Advertisement

ఆ తర్వాత అదే పాన్ లో ఒక కప్పు బాదం గింజలు,( Almonds ) ఒక కప్పు వాల్ నట్స్, రెండు టేబుల్ స్పూన్లు అవిసె గింజలు, రెండు టేబుల్ స్పూన్లు చియా సీడ్స్ ని విడివిడిగా వేయించి పెట్టుకోవాలి.ఇప్పుడు మిక్సీ జార్ లో వేయించుకున్న గుమ్మడి గింజలు, బాదంపప్పు, అవిసె గింజలు, చియా సీడ్స్, వాల్ నట్స్ ఇలా ఒక్కొక్కటిగా వేసుకుంటూ పొడి చేసుకోవాలి.

చివర్లో అన్నిటినీ ఒక బౌల్ లో వేసుకుని బాగా మిక్స్ చేసుకుంటే మన పొడి రెడీ అవుతుంది.

ఫ్రిడ్జ్ లో ఈ పొడిని( Powder ) స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా వాడుకోవచ్చు.ఉదయం లేదా రాత్రివేళ ఒక గ్లాస్ పాలల్లో ఈ పొడిని కలిపి తీసుకోవాలి.ఈ పొడిలో కాల్షియం, మెగ్నీషియం, ఐర‌న్‌, కాప‌ర్‌, జింక్‌, ప్రోటీన్‌, సెలీనియం, ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్స్‌, ఫైబ‌ర్ తో స‌హా అనే పోష‌కాలు నిండి ఉంటాయి.

నిత్యం ఈ పొడిని తీసుకోవ‌డం వ‌ల్ల శరీరానికి బోలెడంత శక్తి లభిస్తుంది.బలహీనత( Weakness ) దూరం అవుతుంది.ఎముకలు, కండరాలు దృఢంగా మారతాయి.

అఖిల్ జైనాబ్ పెళ్లి అప్పుడేనట.. మూడు నెలల గ్యాప్ లో అక్కినేని హీరోల పెళ్లి జరగనుందా?
ఎంతో టాలెంట్ ఉన్నా లక్ లేక వెనుకబడిన సత్యదేవ్.. లక్ కలిసిరావట్లేదా?

అలాగే ఈ పొడిలో ఉండే ట్రిప్టోఫాన్ అనే అమినో యాసిడ్ నిద్రలేమి( Insomnia ) సమస్యను వదిలిస్తుంది.నిద్ర నాణ్యతను పెంచుతుంది.మ‌గ‌వారు పాల‌ల్లో క‌లిపి ఈ పొడిని తీసుకుంటే స్పెర్మ్ కౌంట్ పెరుగుతుంది.

Advertisement

ఆడ‌వారిలో సంతానోత్పత్తి సామ‌ర్థం ఇంప్రూవ్ అవుతుంది.అంతేకాదు ఈ పొడి రొమ్ము, ప్రోస్టేట్ మరియు పెద్దప్రేగు తో సహా కొన్ని క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

ర‌క్త‌హీన‌త‌ను త‌రిమి కొడుతుంది.మానసిక స్థితిని మెరుగుప‌రుస్తుంది.

మూత్ర సంబంధిత రుగ్మతల నివారణిగా సైతం ప‌ని చేస్తుంది.

తాజా వార్తలు