Liver Health : వారంలో రెండుసార్లు ఈ జ్యూస్ ను తీసుకున్నారంటే లివర్ వ్యాధులు మీ వంక కూడా చూడవు!

మన శరీరంలో అతి ముఖ్యమైన అవయవాల్లో లివర్ ( Liver ) ఒకటి.జీర్ణ వ్యవస్థ సక్రమంగా పని చేయడంలో లివర్ కీలక పాత్ర పోషిస్తుంది.

ఆహారంలోని వ్యర్థాలను, విషతుల్యాలను తొలగిస్తుంది.శరీరంలో ఏర్పడే ఇన్ఫెక్షన్లు, కొవ్వులు, రక్తంలోని చక్కెర స్థాయిలను లివర్‌ నియంత్రిస్తుంది.

ముఖ్యమైన హార్మోన్లను, ఎంజైమ్‌లను త‌యారు చేస్తుంది.ఇలా ఒకటి కాదు రెండు కాదు మ‌న శ‌రీరంలో 500కు పైగా పనులను లివర్ నిర్వర్తిస్తుంది.

అటువంటి లివ‌ర్ ఆరోగ్యం విషయంలో ఏమాత్రం అశ్రద్ధ వహించకూడదు.నిజానికి 90 శాతం కాలేయం దెబ్బ తినేంతవరకు వ్యాధి లక్షణాలు బయటప‌డ‌వు.

Advertisement

అందుకే లివర్ వ్యాధులు( Liver Diseases ) తలెత్తాక‌ బాధపడడం కంటే రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో మేలు.అయితే అందుకు కొన్ని కొన్ని ఆహారాలు అద్భుతంగా తోడ్పడతాయి.

అటువంటి వాటిలో ఇప్పుడు చెప్పబోయే జ్యూస్( Juice ) కూడా ఒకటి.వారంలో కేవలం రెండుసార్లు ఈ జ్యూస్ ను తీసుకున్నారంటే లివర్ వ్యాధులు మీ వంక కూడా చూడవు.

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ జ్యూస్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

ముందుగా బ్లెండర్ తీసుకుని అందులో ఒక కప్పు పీల్ తొలగించి సన్నగా కట్ చేసిన సొరకాయ ముక్కలు( Bottle Gourd ) వేసుకోవాలి.అలాగే పావు కప్పు సన్నగా తరిగిన క్యాబేజీ( Cabbage ) ముక్క‌లు, నాలుగు పీల్ తొలగించిన కీర దోసకాయ( Cucumber ) స్లైసెస్, హాఫ్ యాపిల్( Apple ) వేసుకోవాలి.అలాగే రెండు టేబుల్ స్పూన్లు నిమ్మరసం, రెండు టేబుల్ స్పూన్ల తేనె, ఒక గ్లాస్ వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

ఆ హీరో క్రేజ్ మామూలుగా లేదుగా.. చైనా సూపర్‌మార్కెట్‌లోనూ ఆయన పాటలు.. వీడియో వైరల్..
మోహన్ బాబు ఫ్యామిలీ లో గొడవలు ఇప్పుడప్పుడే తగ్గేలా లేవా..?

ఇలా గ్రైండ్ చేసుకున్న జ్యూస్ ను స్ట్రైనర్ సహాయంతో ఫిల్టర్ చేసుకుని ఖాళీ కడుపుతో సేవించాలి.

Advertisement

ఈ జ్యూస్ లో లివర్ ఆరోగ్యానికి తోడ్పడే పోషకాలు పుష్కలంగా ఉంటాయి.వారానికి రెండు సార్లు ఈ జ్యూస్ ను తీసుకుంటే లివర్ వ్యాధులకు దూరంగా ఉండవచ్చు.లివర్ ఆరోగ్యానికి ఈ జ్యూస్ అండగా ఉంటుంది.

లివర్ పనితీరును మెరుగుపరుస్తుంది.ఫ్యాటీ లివర్, లివర్ డ్యామేజ్ తో సహా లివర్ సంబంధిత వ్యాధులన్నిటికీ ఈ జ్యూస్ చెక్ పెడుతుంది.

కాబట్టి తప్పకుండా ఈ హెల్తీ జ్యూస్ ను డైట్ లో చేర్చుకునేందుకు ప్రయత్నించండి.లివ‌ర్‌ ఆరోగ్యాన్ని కాపాడుకోండి.

తాజా వార్తలు