వింటర్ లో క్యారెట్ ని ఇలా తీసుకుంటే ఆరోగ్యంతో పాటు అందం కూడా పెరుగుతుంది!

ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వినియోగించే కూరగాయల్లో క్యారెట్ ముందు వరుసలో ఉంటుంది.క్యారెట్ తీయగా ఉండడమే కాదు ఎన్నో అమోఘమైన పోషక విలువలను కలిగి ఉంటుంది.

క్యారెట్ ను డైట్ లో చేర్చుకోవడం వల్ల వివిధ రకాల అనారోగ్య సమస్యలు ద‌రి దాపుల్లోకి రాకుండా ఉంటాయి.ముఖ్యంగా ప్రస్తుత వింటర్ సీజన్ లో క్యారెట్ ను ఇప్పుడు చెప్పబోయే విధంగా తీసుకుంటే ఆరోగ్యం తో పాటు అందం కూడా పెరుగుతుంది.

మరి ఇంకెందుకు ఆలస్యం వింటర్ లో క్యారెట్ ను ఎలా తీసుకుంటే మంచిదో తెలుసుకుందాం పదండి.ముందుగా ఒక క్యారెట్ ను తీసుకుని పీల్ తొలగించి నీటిలో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.

అలాగే ఒక టమాటో ని తీసుకుని వాటర్ లో కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలి.అలాగే రెండు ఆరెంజ్ పండ్లు తీసుకుని సగానికి కట్ చేసి జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.

Advertisement
Taking Carrots Like This In Winter Is Very Good For Health And Skin, Carrots, He

ఆ తర్వాత బ్లెండర్ తీసుకుని అందులో కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు, టమాటో ముక్కలు, ఒక గ్లాస్ ఆరెంజ్ జ్యూస్, చిటికెడు పసుపు, చిటికెడు మిరియాల పొడి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

Taking Carrots Like This In Winter Is Very Good For Health And Skin, Carrots, He

దాంతో మన క్యారెట్‌ టమాటో ఆరెంజ్ జ్యూస్ సిద్ధమవుతుంది.ఈ జ్యూస్ టేస్ట్ గా ఉండడమే కాదు ఆరోగ్యానికి, అందానికి ఎంతో మేలు చేస్తుంది.రోజు బ్రేక్ ఫాస్ట్ కు గంట ముందు ఈ జ్యూస్ ను తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ సిస్టం బూస్ట్ అవుతుంది.

దీంతో సీజనల్ వ్యాధులు దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.అలాగే ఈ క్యారెట్ టమాటో ఆరెంజ్ జ్యూస్ ను డైట్ లో చేర్చుకుంటే రక్తహీనత సమస్య దూరమవుతుంది.చలిని తట్టుకునే సామర్థ్యం లభిస్తుంది.

కంటి చూపు పెరుగుతుంది.రక్తపోటు అదుపులో ఉంటుంది.

ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో నెంబర్ వన్ హీరో అయ్యేది ఎవరు..?
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఆగష్టు 16, సోమవారం, 2021

అలాగే చర్మం నిగారింపుగా యవ్వనంగా మెరుస్తుంది.చర్మంపై మొండి పచ్చలు ఏమన్నా ఉంటే క్రమంగా దూరమవుతాయి.

Advertisement

స్కిన్ టోన్ సైతం మెరుగుపడుతుంది.

తాజా వార్తలు