Periods : నెలసరి టైమ్ లో కడుపు నొప్పి విపరీతంగా వస్తుందా.. ఇలా చేస్తే నిమిషాల్లో రిలీఫ్ పొందుతారు!

నెలసరి ( periods ).ప్రతి నెలా పలకరించేదే అయినా కూడా మ‌హిళ‌ల‌కు ప్రతిసారి అది ఒక పెద్ద గండంలా అనిపిస్తుంది.

నెలసరి శరీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని సైతం ప్రభావితం చేస్తుంది.అందుకే నెలసరి అంటేనే భయపడుతుంటారు.

ఇకపోతే నెలసరి టైం లో కడుపు నొప్పి, నడుము నొప్పి, కాళ్లు ( Stomach pain, back pain, legs )లాగేయడం వంటివి కొందరిని బాగా ఇబ్బంది పెడతాయి.ముఖ్యంగా కడుపు నొప్పి అనేది చాలా మందిలో తలెత్తే సమస్య.

దీని నుంచి బయటపడటం కోసం మందులు వాడుతుంటారు.కానీ సహజంగా కూడా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.

Advertisement

అందుకు ఇప్పుడు చెప్పబోయే టీలు చాలా ఉత్తమంగా సహాయపడతాయి.ఈ జాబితాలో మొదట చెప్పుకోవాల్సింది శొంఠి టీ( Garlic tea ).రెండు గ్లాసుల నీటిలో ఒక స్పూన్ శొంఠి పొడి వేసి పది నుంచి ప‌దిహేను నిమిషాల పాటు మరిగించాలి.ఆ తర్వాత మరిగించిన వాటర్ ను ఫిల్టర్ చేసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్లు నిమ్మరసం( lemon juice ) కలిపితే మన టీ సిద్ధమవుతుంది.

పీరియడ్స్ వచ్చినప్పుడు రోజుకు ఒక కప్పు చొప్పున ఈ టీని తీసుకుంటే చాలా మంచిది.

శొంఠి టీలో యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి.మరియు నొప్పిని నివారించే గుణాలు సైతం మెండుగా ఉంటాయి.అందువల్ల పీరియడ్స్ టైం లో ఈ టీని తీసుకుంటే కడుపు నొప్పితో సహా ఎలాంటి నొప్పులు ఉన్నారు సరే పరార్ అవుతాయి.

నిమిషాల్లో రిలీఫ్ పొందుతారు.

గలిజేరు ఆకుల వల్ల ఎన్ని లాభాలంటే...!?

అలాగే నెలసరి సమయంలో కడుపు నొప్పిని తొందరగా తగ్గించడానికి మునగాకు టీ ( Munagaku Tea )కూడా గ్రేట్ గా హెల్ప్ చేస్తుంది.ఒక గ్లాస్ వాటర్ లో హాఫ్ టేబుల్ స్పూన్ మునగాకు పొడి వేసి ప‌ది నిమిషాల పాటు మరిగించాలి.ఆపై వాటర్ ను ఫిల్టర్ చేసుకుని ఒక స్పూన్ తేనె, ఒక స్పూన్ నిమ్మరసం కలిపి తీసుకోవాలి.

Advertisement

ఇలా కనుక చేస్తే కడుపు నొప్పి, నడుము నొప్పి, కాళ్లు లాగడం, తలనొప్పి వంటివన్నీ దూరం అవుతాయి.నెలసరి సాఫీగా సాగుతుంది.

తాజా వార్తలు