ఒత్తిడిని త‌రిమికొట్టే ఓట్స్‌.. ఇలా తీసుకుంటే మ‌రిన్ని బెనిఫిట్స్‌!

ప్ర‌స్తుత టెక్నాల‌జీ కాలంలో వ‌య‌సుతో సంబంధం లేకుండా దాదాపు అంద‌రికీ ఒత్తిడి అనేది కామ‌న్ శ‌త్రువుగా మారింది.

మానసికంగానే కాదు శారీర‌కంగా కూడా ఒత్తిడి ఎన్నో స‌మ‌స్య‌ల‌ను తెచ్చిపెడుతుంది.

తలనొప్పి, జ్ఞాపకశక్తి లోపించ‌డం, కంటి చూపు త‌గ్గ‌డం, అధిక బ‌రువు, మ‌ధుమేహం, గుండె పోటు, నిద్ర‌లేమి ఇలా ఎన్నో స‌మ‌స్య‌ల‌కు ఒత్తిడి ఒక కార‌ణం అవుతుంటుంది.అందుకే ఆరోగ్యంగా ఉండాలంటే ఒత్తిడిని జయించ‌డం ఎంతో ముఖ్య‌మ‌ని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు.

అయితే ఒత్తిడిని దూరం చేయ‌డానికి కొన్ని కొన్ని ఆహారాలు అద్భుతంగా స‌హాయ‌ప‌డ‌తాయి.అటువంటి ఆహారాల్లో ఓట్స్ ఒక‌టి.

అందులో ముఖ్యంగా ఓట్స్‌ను ఇప్పుడు చెప్ప‌బోయే విధంగా తీసుకుంటే ఒత్తిడి ప‌రార్ అవ్వ‌డ‌మే కాదు మ‌రెన్నో హెల్త్ బెనిఫిట్స్‌ను త‌మ సొంతం చేసుకోవ‌చ్చు.మ‌రి ఇంకెందుకు లేటు ఒత్తిడిని త‌రిమికొట్టాలంటే ఓట్స్‌ను ఎలా తీసుకోవాలో ఓ చూపు చూసేయండి.

Advertisement

ముందుగా ఒక బౌల్‌లో మూడు టేబుల్ స్పూన్ల రోల్ట్ ఓట్స్, గ్లాస్ వాట‌ర్ వేసుకుని పావు గంట పాటు నాన‌బెట్టుకోవాలి.ఈలోపు బ్లెండ‌ర్ తీసుకుని అందులో ఒక క‌ప్పు మామిడి పండు ముక్క‌లు, ఆరు పొట్టు తొల‌గించిన బాదం ప‌ప్పులు, రెండు టేబుల్ స్పూన్ల లోఫ్యాట్ పెరుగు, పావు స్పూన్ యాల‌కుల పొడి, రెండు గింజ తొల‌గించిన ఖ‌ర్జూరాలు, ఒక క‌ప్పు వాట‌ర్ వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి.

ఇప్పుడు ఒక గ్లాస్ జార్ తీసుకుని అందులో నాన‌బెట్టుకున్న ఓట్స్‌, హాఫ్ టేబుల్ స్పూన్ చియా సీడ్స్ మ‌రియు గ్రైండ్ చేసి పెట్టుకున్న మ్యాంగో మిశ్ర‌మం వేసి బాగా కలిపి నైట్ అంతా ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి.

ఈ ఓవ‌ర్ నైట్ ఓట్స్ లో ఉద‌యాన్నే కొన్ని వేయించుకున్న పుచ్చ‌గింజ‌ల‌ను చేర్చి బ్రేక్ ఫాస్ట్ స‌మ‌యంలో తీసుకోవాలి.ఈ విధంగా ఓట్స్ ను త‌ర‌చూ తీసుకుంటే ఒత్తిడి ప‌రార్ అవుతుంది.మ‌నసు, మెద‌డు ప్ర‌శాంతంగా మార‌తాయి.

వెయిట్ లాస్ అవుతారు.గుండె ఆరోగ్యం మెరుగ్గా మారుతుంది.

వావ్‌ : ఒక్క ఆసనంతో ఇన్ని ఉపయోగాలా?

ర‌క్త‌పోటు కంట్రోల్‌లో ఉంటుంది.మ‌రియు ఇమ్యూనిటీ సిస్ట‌మ్ కూడా బూస్ట్ అవుతుంది.

Advertisement

తాజా వార్తలు