టి.కాంగ్రెస్ :  ఈ మాణిక్ రావ్ అయినా మార్చగలరా ? 

తెలంగాణ కాంగ్రెస్ లో పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

ఆ పార్టీలోని నాయకులు తమ రాజకీయ ప్రత్యర్థుల కంటే,  సొంత పార్టీలోని గ్రూపు రాజకీయాల విషయంలోనే నాయకులు సతమతం అవుతూ ఉంటారు.

ఎంతమంది ఇన్చార్జిలు వచ్చినా.అధిష్టానం ఎన్ని హెచ్చరికలు చేసినా,  తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో మాత్రం మార్పు అయితే కనిపించడం లేదు.

తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ కు జనాలు బ్రహ్మరథం పట్టాల్సి ఉన్నా,  రెండుసార్లు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి చెందింది.ఇప్పుడు మళ్లీ సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడం తో ఇప్పుడు కూడా అదే గ్రూపు రాజకీయాలు పార్టీని దెబ్బతీస్తున్నాయి.

ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యవహార శైలిపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ.  తమకు కమిటీలో సరైన ప్రాధాన్యం దక్కలేదనే కారణంతో సీనియర్లంతా గ్రూపులు కట్టడం,  ఈ వ్యవహారాలపై అధిష్టానం స్పందించడం వంటి పరిస్థితితుల నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ సింగ్ రంగంలోకి దిగడం వంటివి జరిగాయి.

Advertisement

సీనియర్లు ప్రధానంగా తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జిగా ఉన్న మాణిక్యం ఠాకూర్ పని తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఆయనపై ఫిర్యాదులు చేయడంతో ఆయనను ఇన్చార్జిగా మార్చారు.కొత్తగా తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జిగా మాణిక్ రావు ఠాక్రే ను నియమించారు.

మహారాష్ట్ర పిసిసి అధ్యక్షుడిగా ఎనిమిదేళ్లు పాటు పనిచేసిన అనుభవం ఉన్న మాణిక్యరావు ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితిని ఎంతవరకు మార్చగలరనేది ఆసక్తికరంగా మారింది .అసెంబ్లీ ఎన్నికలకు ఒకవైపు సమయం దగ్గర పడుతుంది.ఇప్పుడు పార్టీని బలోపేతం చేయడంతో పాటు,  గ్రూప్ రాజకీయాలను చక్కదిద్దే బాధ్యత మాణిక్ రావు పై పడింది.

అయితే అసలు ఈ మాణిక్ రావును తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జిగా నియమించడానికి కారణాలు ఉన్నాయి. 

గాంధీ కుటుంబానికి ఈయన వీర విధేయుడు గా ఉండడమే కాకుండా , సొంత పార్టీలో పరిస్థితులను చక్కదిద్దడంలో బాగా ఆరితేరిన వ్యక్తి.  ఆయన పిసిసి అధ్యక్షుడిగా ఉన్న సమయంలో మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చే విధంగా ఆయన కృషి చేయడం,  శరత్ పవర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన మహారాష్ట్ర హోంమంత్రిగా పనిచేసి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడంతో ఆయన అయితేనే తెలంగాణ కాంగ్రెస్ లో పరిస్థితిని చక్కదితగలరని అధిష్టానం నమ్మి ఆయనను పిసిసి అధ్యక్షుడిగా నియమించింది .వచ్చేవారమే ఆయన తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి హోదాలో రానున్నారు.ఆయన వచ్చిన తర్వాత అయినా తెలంగాణ కాంగ్రెస్ లో తప్పకుండా మార్పు కనిపిస్తుందనే నమ్మకంతో ఆ పార్టీ హై కమాండ్ ఉందట.

Amerio Erfahrungen Und Reputation : Eine Analytische Einordnung
Shuffle : Analyse De L’expérience Mobile Et Des Paiements...

 .

Advertisement