అక్కడ వాటర్ బాటిల్ కొనాలంటే మీ ఆస్తులు అమ్ముకోవాల్సిందే... ఎక్కడంటే?

నీరు లేనిదే సకల జీవకోటికి ఆధారం లేదు.అందుకే జలమే ప్రాణం అన్న నానుడి పుట్టుకొచ్చింది.

అవును, మానవ మనుగడకు నీరు ( Water ) అనేది ఎంత ముఖ్యమో ఇక్కడ ప్రత్యేకించి ప్రస్తావించాల్సిన పనిలేదు.ఒక వ్యక్తి ఆహారం( Food ) లేకుండా కొంతకాలం జీవించగలడు, కానీ నీరు లేకుండా బతకడం అనేది దాదాపుగా అసాధ్యం.

ఇక పూర్వం నీరు ఎక్కడ పడితే అక్కడ ఉచితంగా లభించేది.ఎందుకంటే ఇది ప్రకృతి వనరు కాబట్టి.

అలాంటి ప్రకృతి వనరుని నేడు కొంతమంది వ్యాపారులు పెద్ద వ్యాపారంగా మార్చేశారు.అవును.

Advertisement

ఇపుడు మంచి నీరుని( Drinking Water ) ఉచితంగా పొందే పరిస్థితి లేదు.ప్రపంచవ్యాప్తంగా ప్రజలు నీటి కోసం నేడు డబ్బులు చెల్లిస్తున్న పరిస్థితి.

ముఖ్యంగా మన దేశంలో ఐతే కొన్ని రాష్ట్రాల మధ్య ఏకంగా నీటి కోసం యుద్ధాలే జరుగుతున్నాయి.కావేరి జలాలు( Kaveri Water ) వివాదం అటువంటిదే.

ఈ తరుణంలో ప్రపంచంలోని వివిధ దేశాల్లో లభించే తాగునీటి ధర గురించి తెలుసుకుంటే మీకు ఆశ్చర్యం కలుగుతుంది.

ఒక సర్వే ప్రకారం ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన తాగునీరు స్విట్జర్లాండ్‌లో( Switzerland ) కనుగొనబడింది.ఇక్కడ 330 మిల్లీలీటర్ల అతి చిన్న బాటిల్ ధర మొత్తం రూ.347.09.అలా టాప్ 100 దేశాల జాబితాలో చూసుకుంటే భారతదేశం( India ) 95వ స్థానంలో ఉంది.ఇక్కడ 330మి.లీ వాటర్ బాటిల్ ధర రూ.16.01.స్విట్జర్లాండ్లో ఒక లీటరు నీటి ధర రూ.1000 కంటే ఎక్కువగా వుంది.తరువాత లిస్టులో వున్నది యూరోపియన్ దేశం లక్సెంబర్గ్‌.

5 Gringos Customer Support And Service Quality (AU) — A Practical Guide
చర్మ ఆరోగ్యం కొరకు ద్రాక్షలో ఉన్న ప్రయోజనాలు

ఇక్కడ 330మి.లీ వాటర్ బాటిల్ రూ.254.14కి దొరుకుతుంది.దీని తర్వాత డెన్మార్క్( Denmark ) 3వ ప్లేసులో ఉంది.

Advertisement

ఇక్కడ 330మి.లీ వాటర్ బాటిల్ రూ.237.24.అదే జర్మనీలో( Germany ) చూసుకుంటే 330మి.లీ వాటర్ బాటిల్ 207.36 రూపాయలు మాత్రమే.ఆస్ట్రియాలో ఒక్కో బాటిల్ రూ.205.80కి లభిస్తుండగా, నార్వేలో రూ.205.60కి, బెల్జియంలో వాటర్ బాటిల్ రూ.199.24కి, నెదర్లాండ్స్‌లో 330మి.లీ వాటర్ బాటిల్ రూ.188.51కి, ఆస్ట్రేలియాలో వాటర్ బాటిల్ రూ.175.55కి, ఫ్రాన్స్‌లో 330మి.లీ వాటర్ బాటిల్ 162.01 రూపాయలకు అందుబాటులో కలవు.

" autoplay>

తాజా వార్తలు