ముందు విడాకులు లోపల కాపురం అంటూ వైఎస్ షర్మిలపై యాంకర్ షాకింగ్ కామెంట్స్!

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి కుమార్తె షర్మిలారెడ్డి.

తన సోదరుడు జగన్ మోహన్ రెడ్డి తరుపున ప్రచారం చేసి ప్రజలకు దగ్గర అయ్యింది.

ఎన్నో కిలోమీటర్ల దూరం పాదయాత్ర చేసి ఆంధ్ర ప్రదేశ్ లో ఎంతో మందికి అభిమాన కార్యకర్తగా నిలిచింది.తాజాగా తెలంగాణలో కూడా కొత్త రాష్ట్రం ప్రకటించిన సంగతి తెలిసిందే.

తెలంగాణలో మళ్లీ వైఎస్ పాలన మొదలుపెట్టడానికి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని ప్రకటించింది.అంతేకాకుండా జెండాను ఆవిష్కరించిది.

ఈ నేపథ్యంలో కొన్ని వ్యాఖ్యలు చేసింది షర్మిల.బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై కొన్ని వ్యాఖ్యలు చేసింది.

Advertisement
Anchor And Bjp Leader Swetha Reddy Shocking Comments On Ys Sharmila, Ys Sharmil

ఆయన మాట్లాడితే కేసీఆర్ అవినీతికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయంటూ.వాటిని బయట పెడతానంటూ.

కేసులు పెడతానంటూ.జైల్లో పెట్టిస్తామంటూ అంటుంటాడని కానీ ఇంతవరకు ఆధారాలు ఉన్నా కూడా జైలుకు పంపడం లేదు అంటూ వ్యాఖ్యలు చేసింది.

అంటే వీరిద్దరి మధ్య డీల్ కుదిరిందేమోనని, వీళ్ళు ఇద్దరు తోడు దొంగలే అంటూ మాట్లాడింది.వాళ్లలో వాళ్లే కొట్టినట్టు, ఏడ్చినట్టు నటిస్తూ ప్రజలని మోసం చేస్తున్నారంటూ.

కానీ వీరిద్దరు ఒకటే అంటూ గట్టిగా తెలిపింది.ఇక ఏ పార్టీ వ్యక్తులైనా వైయస్సార్ గురించి కించపరిచి మాట్లాడితే వైయస్సార్ అభిమానులు ఉరికించి ఉరికించి కొడతారు అంటూ గట్టిగా వార్నింగ్ ఇచ్చింది.

Jyothamma Jabardast : మానవత్వం మర్చిపోయిన ఓ సమాజమా ..అగ్గి తో కడగాలి నిన్ను !

ఈ నేపథ్యంలో ప్రముఖ యాంకర్, బీజేపీ మహిళా నాయకురాలు శ్వేతారెడ్డి. షర్మిలపై మండిపడింది.

Anchor And Bjp Leader Swetha Reddy Shocking Comments On Ys Sharmila, Ys Sharmil
Advertisement

కేసీఆర్ కు, బండి సంజయ్ కు డీల్ ఎలా కుదిరిందని అంటావని మండిపడింది.షర్మిలకు పార్టీ పెట్టిన తర్వాతే తెలంగాణ గుర్తుకు వచ్చిందంటూ.మీరు ఇప్పుడు వచ్చారు కానీ.

బండి సంజయ్ ఎప్పుడో వచ్చాడు.తెలంగాణ ప్రజల తరపున పోరాడుతున్నాడని, ప్రభుత్వం నుండి ఒత్తిడి ఉన్నా ముందుకు వెళ్తున్నాడని తెలిపింది.

ఇక తాను గతంలో పలుమార్లు తెలంగాణ సమస్యలపై షర్మిలని ప్రశ్నించిందట.కానీ బండి సంజయ్ మాత్రం ఏ సమస్య ఉన్న ప్రజల కోసం పోరాడుతున్నాడని.

అలాంటిది కేసీఆర్ తో ఎలా డీల్ కుదుర్చుకున్నాడని ప్రశ్నించింది.

అంతేకాకుండా కేసీఆర్ తో డీల్ కుదుర్చుకుంది షర్మిలనే అంటూ వ్యాఖ్యలు చేసింది.బండి సంజయ్ కి డీల్ కుదుర్చుకునే అవసరం లేదని.ఆయనకు ముందు విడాకులు తీసుకొని.

తర్వాత ప్రేమించుకోవడాలు, లోపల కాపురాలు చేసుకోవడానికి ఇలాంటివి తెలియదని తెలిపింది.కేసీఆర్ మెడలు వంచడానికి నికార్సైన నాయకుడు సంజయ్ అంటూ, ఎన్నోసార్లు అరెస్టయి పోలీసులతో కూడా కొట్టించుకున్నాడని.

ఇవన్నీ షర్మిల గుర్తు చేసుకోవాలని.ఒకసారి ఆయన గురించి మాట్లాడే ముందు ఆలోచించు అంటూ శ్వేతారెడ్డి.

షర్మిలపై మండిపడింది.

తాజా వార్తలు