జబర్దస్త్ రష్మీకి స్వయంవరం...ఆ వ్యక్తి రావడంతో షాక్?

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్ రష్మి( Rashmi ) గౌతమ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

జబర్దస్త్ ( Jabardasth )షో ద్వారా యాంకర్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది రష్మి.

రష్మీకి ఏ రేంజ్ లో అభిమానులు ఉన్నారో మనందరికీ తెలిసిందే.రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ ముద్దుగుమ్మకు భారీగా అభిమానులు ఉన్నారు.

రష్మీ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న శుభవార్త రష్మీ పెళ్లి ఎప్పుడు.రష్మీ ఎక్కడికి వెళ్ళినా కూడా ఇదే ప్రశ్న ఎదురవుతూ ఉంటుంది.

అయితే రష్మీ పెళ్లి అంటూ గతంలో సుధీర్( Sudheer ) తో రెండు మూడు సార్లు ఒక ఈవెంట్ అనే ప్లాన్ చేసిన విషయం తెలిసిందే.

Advertisement

యాంకర్ రష్మీ అంటే చాలా మంది గుర్తుపట్టకపోవచ్చు కానీ సుధీర్,రష్మీ అంటే చాలు ఇస్తే గుర్తుపట్టేస్తారు.అంతలా ఈ జంట పాపులారిటీని సంపాదించుకుంది.స్టేజ్ పై వీరికి రెండు మూడు సార్లు పెళ్లి జరగడంతో వారు నిజంగానే ఒకటయ్యారేమో నిజంగా ప్రేమించుకుంటున్నారేమో అని చాలామంది అభిప్రాయపడ్డారు.

కానీ అదంతా కేవలం స్కిట్ కోసం మాత్రమే అని తెలియడంతో అభిమానులు నిరాశ చెందారు.వయసు నాలుగు పదులకు దగ్గర పడుతున్న యాంకర్ రష్మీ ఇంకా పెళ్లి చేసుకోకపోవడంతో అభిమానులు ఆ విషయంలో అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉంటారు.

కాగా రీల్ లైఫ్ లోనే కాకుండా రియల్ లైఫ్ లో కూడా రష్మీ సుధీర్ ఒకటైతే చూడాలని ఎంతో మంది అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.కానీ గత ఏడాది జబర్దస్త్ కి, శ్రీదేవి డ్రామా కంపెనీకి గుడ్ బై చెప్పడంతో అప్పటి నుంచి వీరిద్దరి మధ్య దూరం పెరుగుతూ వచ్చింది.ఇదిలా ఉంటే తాజాగా రష్మీ స్వయంవరం ప్రకటించింది.

నటి ఇంద్రజ( Indraja ) రష్మి కోసం స్వయం వరం ఏర్పాటు చేసింది.తనకు స్వయంవరం అంటే ఆనందంతో ఎగిరి గంతులు వేసింది.

యశ్ టాక్సిక్ సినిమాలో స్టార్ హీరోయిన్.... అధికారిక ప్రకటన వెల్లడి!
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఏప్రిల్ 25, ఆదివారం, 2021

ఇక స్వయం వరం కోసం అబ్బాయిలు వస్తుంటే సిగ్గులొలికిస్తూ ఆకట్టుకుంది.యాంకర్‌ రష్మి గౌతమ్‌ స్వయం వరం అనేసరికి ఎక్కడెక్కడివాళ్లో వచ్చి క్యూ కట్టారు.

Advertisement

రష్మిని తన వశం చేసుకోవాలని చాలా మంది ప్రయత్నిస్తున్నారు.కొత్త వారితో రష్మి కోసం స్వయంవరంలో పాల్గొన్న వారిలో రామ్‌ ప్రసాద్‌, ఇతర కమెడియన్లు, డాన్సర్లు, అలాగే టీవీ ఆర్టిస్టులు కూడా ఉన్నారు.

వారిలో పెళ్లైన నటుడు అమర్‌ దీప్‌ ( Amar Deep )కూడా ఉండటం విశేషం.రష్మి ఇది నీ కోసం అంటూ ఓ గిఫ్ట్ తీసుకొచ్చాడు అమర్‌ దీప్‌.

అయితే అతన్ని చూసి నీకు పెళ్లైందిగా, ఎందుకొచ్చావ్‌ అని ప్రశ్నించాడు రామ్ ప్రసాద్‌.దీంతో ఆయన స్పందిస్తూ, ఎవరైనా రావచ్చు అన్నారుగా, అందుకే వచ్చానని చెప్పడం హైలైట్‌గా నిలిచింది.అయితే ఇదంతా స్కిట్ లో భాగమే.

ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.

తాజా వార్తలు