న్యూయార్క్‌లోని స్వామి నారాయణ్ ఆలయంలో విధ్వంసం.. మోడీ పర్యటనకు ముందు కలకలం

న్యూయార్క్‌( New York )లోని మెల్‌విల్లేలో ఉన్న బీఏపీఎస్ స్వామి నారాయణ్ ఆలయంలో గుర్తు తెలియని వ్యక్తులు విధ్వంసం సృష్టించడం కలకలం రేపింది.

ఈ ఘటనను న్యూయార్క్‌లోని భారత కాన్సులేట్ కార్యాలయం ఖండించింది.

ఇది హేయమైన చర్య అని.ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదని , దీనికి కారణమైన వారిని చట్టం ముందు నిలబెట్టేందుకు యూఎస్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులతో టచ్‌లో ఉన్నట్లు ఇండియన్ కాన్సులేట్ పేర్కొంది.మెల్‌విల్లే లాంగ్ ఐలాండ్‌లోని సఫోల్క్ కౌంటీలో ఈ ఆలయం ఉంది.16000 సీట్ల సామర్ధ్యం ఉన్న ప్రఖ్యాత నసావు వెటరన్స్ మెమోరియల్ కొలిజీయం నుంచి 28 కి.మీ దూరంలోనే ఆ దేవాలయం ఉంది.సెప్టెంబర్ 22న జరిగే మెగా కమ్యూనిటీ ఈవెంట్‌లో భారత ప్రధాని నరేంద్ర మోడీ( Narendra Modi ) ప్రసంగించనున్నారు.

అంతలోనే ఈ ఘటన జరగడం భారత్ - అమెరికాలలో దుమారం రేపింది.

ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతున్న ఫుటేజ్ ప్రకారం.ఆలయం వెలుపల, రహదారి, సైన్ బోర్డులపై నలుపు రంగు స్ప్రే చేశారు అగంతకులు.హిందూ అమెరికన్ ఫౌండేషన్ సోమవారం ఎక్స్‌లో దీనిపై స్పందించింది.

Advertisement

నసావు కౌంటీ( Nassau County )లో భారతీయ కమ్యూనిటీ భారీ ఈవెంట్‌కు ప్లాన్ చేసిన సమయంలో హిందూ సంస్థలకు ఇలాంటి బెదిరింపులు రావడంపై అమెరికా న్యాయ శాఖ, డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌లాండ్ సెక్యూరిటీ పరిశోధించాలని డిమాండ్ చేసింది.

ఇది పరికిపంద చర్య అని. హిందూ, భారతీయ సంస్థలపై ఇటీవలి కాలంలో బెదిరింపులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ దాడిని ప్రత్యేక కోణంలో పరిశోధించాలని హిందూ అమెరికన్ ఫౌండేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సుహాగ్ శుక్లా ( Suhag Shukla )ఎక్స్‌లో పోస్ట్ చేశారు.ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్(Gurpatwant Singh Pannun ) ఇటీవల హిందూ, భారతీయ సంస్థలను బెదిరిస్తూ ఓ వీడియో విడుదల చేశారని సుహాగ్ గుర్తుచేశారు.

న్యూయార్క్ స్వామి నారాయణ ఆలయంలో జరిగిన ఘటన.కాలిఫోర్నియా, కెనడా దేవాలయాలపై జరిగిన దాడులకు సమానమని ఆయన పేర్కొన్నారు.

తాజా వార్తలు