గోవాలో గొడవ చేస్తున్న మహేష్..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఈపాటికి ఈ సినిమా పూర్తయి ఉండేది.

కానీ కరోనా కారణంగా ఈ సినిమా పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది.ఇక ఈ సినిమాను దర్శకుడు పరశురామ్ పూర్తి కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని మహేష్ అభిమానులు అప్పుడే లెక్కలు వేస్తున్నారు.

SVP Goa Schedule Starts With Action, Mahesh Babu, Parasuram, Keerthy Suresh, Tol

కాగా ఇటీవల ఈ సినిమా నుండి వరుసగా అప్‌డేట్లు వస్తుండటంతో మహేష్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.రీసెంట్‌గా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్, ఓ చిన్నపాటి టీజర్ కూడా రిలీజ్ కావడంతో ఈ సినిమాపై అప్పుడే అంచనాలు పీక్స్‌కు చేరుకున్నాయి.

ఇక ఈ సినిమా షూటింగ్‌ను హైదరాబాద్‌లో ముగించుకుని తాజాగా గోవాలో జరుపుకునేందుకు చిత్ర యూనిట్ అక్కడికి చెక్కేసింది.అంతేగాక ఈరోజు ఓ యాక్షన్ సీన్‌తో గోవాలో షూటింగ్ కూడా మొదలుపెట్టారు.

Advertisement

మొత్తానికి గోవాలో పాటలకోసం అందరూ వెళ్తే, మహేష్ బాబు మాత్రం యాక్షన్ కోసం వెళ్లాడని ఆయన అభిమానులు అంటున్నారు.పూర్తిగా ఆర్థిక నేరాల బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ అల్ట్రా స్టైలిష్ లుక్‌లో మనకు కనిపించనున్నాడు.

ఆయన ఆఫీసులో పనిచేసే ఉద్యోగినిగా అందాల బ్యూటీ కీర్తి సురేష్ నటిస్తుంది.థమన్ ఈ సినిమాకు అదిరిపోయే సంగీతాన్ని అందిస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ పాటలు మహేష్ కెరీర్‌లో మరో మైల్‌స్టోన్‌గా నిలిచిపోవడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నాడు.ఈ సినిమాను సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.

మరి గోవాలో జరిగే యాక్షన్ సీక్వెన్స్ ఈ సినిమాలో ఏ రేంజ్‌లో ఉంటుందో తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.

న్యూస్ రౌండప్ టాప్ - 20
Advertisement

తాజా వార్తలు