ఏపీ అసెంబ్లీ నుంచి 14 మంది టీడీపీ సభ్యుల సస్పెన్షన్

ఏపీ అసెంబ్లీలో మరోసారి గందరగోళం నెలకొంది.14 మంది టీడీపీ సభ్యులపై సస్పెన్షన్ వేటు పడింది.

వ్యవసాయంపై చర్చకు పట్టుబట్టిన టీడీపీ ఎమ్మెల్యేలు.

స్పీకర్ తమ్మినేని పోడియం వద్దకు దూసుకెళ్లి ఆందోళన చేశారు.దీంతో వ్యవసాయంపై చర్చకు ఎల్లుండి అవకాశం ఇస్తామని స్పీకర్ చెప్పారు.అయినా ఆందోళన విరమించకపోడంతో ఎమ్మెల్యేల తీరుపై స్పీకర్ తమ్మినేని అసహనం వ్యక్తం చేశారు.

అనంతరం 14 మంది టీడీపీ సభ్యులను ఒక రోజు పాటు సస్పెండ్ చేశారు.

Advertisement