తెలంగాణ సీఎం పదవిపై కొనసాగుతున్న సస్పెన్స్ !

తెలంగాణలో కాంగ్రెస్( Telangana congress ) వేవ్ బలం గా ఉందని చాలామంది అంచనా వేసినా కెసిఆర్ రాజకీయ చాణిక్యం పై కూడా చాలామంది నమ్మకం వ్యక్తం చేశారు.

ముఖ్యంగా తమ పాలన లో అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి తెలంగాణ ఆదాయాన్ని గణనీయం గా పెంచడమే కాకుండా దేశంలో అనేక అంశాలలో తెలంగాణను ప్రథమ స్థానంలో నిలిపిన కేసీఆర్ ఓటమిని కూడా చాలామంది ఊహించలేదు.

అయితే ఎట్టకేలకు ఏకపక్షంగా కాంగ్రెస్ మ్యాజిక్ ఫిగర్ ను కూడా దాటేయడం తో కెసిఆర్ ఓటమి స్పష్టం అయిపోయింది .ఇప్పుడు మొదటి సవాలు ని కాంగ్రెస్ దాటేసినా అసలు పరీక్ష అయిన సీఎం పదవిపై తీవ్ర ఉత్కంఠ కొనసాగుతూ ఉంది.

ముఖ్యంగా అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉండే కాంగ్రెస్లో సీఎం అభ్యర్థుల ఆశవహులు కూడా అరడజను మంది కి పైగానే ఉన్నారు.అందులో హేమాహేమీలు అనదగ్గ దగ్గనాయకులు భారీ మెజారిటీ తెచ్చుకున్న నాయకులు కూడా ఉన్నారు.దీంతో ఇప్పుడు సీఎం సీటు పై తకరారు తో ప్రభుత్వానికి ఎక్కడ ఎసరు వస్తుందో అని కాంగ్రెస్ అధిష్టానం కూడా ఆలోచనలో పడినట్లుగా వార్తలు వస్తునాయి .

ముఖ్యంగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డే ముఖ్యమంత్రి అంటూ మెజారిటీ ప్రజలు నిర్ణయించేసుకున్నప్పటికీ సీఎల్పీ నాయకుడు బట్టి విక్రమార్క( Mallu Bhatti Vikramarka ) తో పాటు మరో సీనియర్ నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా రేసులో ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి.బట్టి విక్రమార్క అయితే ముఖ్యమంత్రి పదవి ఇస్తే తీసుకుంటాను అన్నట్టుగా ఇప్పటికే వ్యాఖ్యలు చేయగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ముఖ్యమంత్రి పదవిపై పట్టుపడుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి .దాంతో రేవంత్ ను ముఖ్యమంత్రిని చేస్తే ఏమైనా ప్రభుత్వానికి ఏమైనా ఇబ్బంది ఉందా అన్న కోణంలో మీడియాలో జోరుగా వార్తలు షికారు చేస్తూ ఉండటం గమనార్హం .దళిత వ్యక్తి అయినందున భట్టి విక్రమార్కను ముఖ్యమంత్రిని చేస్తే ప్రభుత్వాన్ని మనుగడ కి ఎటువంటి ఇబ్బంది ఉండదని, అప్పుడు ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని పడగొట్టేలాంటి ఆలోచనలు కూడా పెట్టుకోవని కొంతమంది రేవంత్ వ్యతిరేకులు సలహాలు కూడా ఇస్తున్నారట.అయితే అసలు తెలంగాణలో కాంగ్రెస్ ఈ స్థాయిలో పుంజుకుని విజయం సాధించడానికి, కేసీఆర్ వ్యతిరేకలందరినీ ఐక్యం చేయడానికి రేవంత్ రెడ్డి పడిన కష్టానికి గుర్తింపు ముఖ్య మంత్రి పదవి మాత్రమే అని ఆయనకు తప్ప ఎవరికీ అంత అర్హత లేదంటూ రేవంత్ రెడ్డి వర్గం వాదిస్తున్నట్లుగా తెలుస్తుంది.

Advertisement

ఏది ఏమైనా అతి స్వల్ప మెజారిటీని కాపాడుకోవడానికి కాంగ్రెస్ అధిష్టానం మాత్రం అత్యంత జాగ్రత్త వ్యవహరించవలసిన అవసరం ఉందన్నది వినిపిస్తున్న వార్తల సారాంశం .

Lorem Ipsum Dolor Sit Amet
Advertisement

తాజా వార్తలు