చిన్నగా,పుల్లగా ఉండే రేగి పండ్ల గురించి తెలిస్తే తినటం మాత్రం అసలు మానరు

రేగు పండును అందరు చాలా ఇష్టంగా తింటారు.రేగు జాతులు సుమారుగా 40 రకాలు ఉన్నప్పటికీ కేవలం రెండు రకాలు మాత్రమే మనకు విరివిగా దొరుకుతాయి.

ఇవి ఎక్కువగా పొలాల్లోను మరియు రోడ్డుకు ఇరువైపులా ఉంటాయి.రేగు పళ్ళు చాలా తియ్యగా,పుల్లని రుచులలో ఉంటాయి.

Surprising Health Benefits Regi Pallu-Surprising Health Benefits Regi Pallu-Telu

వీటిని బాణునికి చిహ్నంగా భావిస్తారు.సంక్రాతి పండుగ రోజుల్లో భోగి రోజున పిలల్లకు రేగు పండ్లతో భోగి పండ్లు పోస్తారు.

అయితే ఇలా రేగి పండ్లనే ఎందుకు పోస్తారో చాలా మందికి తెలియదు.భోగి రోజున చిన్న పిల్లలకు రేగి పండ్లను పోస్తే జీవితం అంతా భోగ భాగ్యాలతో తులతూగుతారని నమ్మకం.

Advertisement

భోగి రోజున పోస్తారు కనుక భోగి పళ్ళు అని అంటారు.రేగు గుజ్జుతో టీ కూడా తయారుచేస్తారు.

అయితే మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా రేగు పండ్లతో పచ్చడి చేస్తారు.రేగు పండ్లలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

ఇప్పుడు వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.అర లీటర్ నీటిలో గుప్పెడు రేగు పండ్లను వేసి నీరు సగం అయ్యేవరకు మరిగించాలి.

ఆ నీటిని వడకట్టి కొంచెం తేనే కలిపి రాత్రి పడుకొనే ముందు త్రాగితే రక్తంలో గ్లుంటామిక్‌ ఆమ్లం ఎక్కువగా విడుదల అయ్యి మెదడు చురుగ్గా పనిచేయటానికి సహాయపడుతుంది.ఆయుర్వేదంలో ఈ చెట్టు బెరడును ఉపయోగించి చేసే కషాయాన్ని మలబద్దకం నివారణకు ఉపయోగిస్తారు.రేగు ఆకులను నూరి పండ్ల మీద రాస్తే త్వరగా నయం అవుతాయి.కడుపులో మంటను తగ్గించి జీర్ణక్రియ సక్రమంగా జరిగేలా జీర్ణక్రియను ప్రోత్సహిస్తాయి.

ఇండియా గొప్పదా? పాకిస్థాన్ గొప్పదా? ఆతిథ్యంపై కెనడా వ్యక్తిని అడిగితే.. మైండ్ బ్లోయింగ్ ఆన్సర్..
చిరు సినిమాకు ముహూర్తం ఫిక్స్ చేసిన అనిల్ రావిపూడి....ఒక్క ట్వీట్ తో ఫుల్ క్లారిటీ!

బరువు పెరగడంలో, కండరాలకు బలాన్ని ఇవ్వటంలో, శారీరక శక్తినివ్వడంలో ఎంతగానో ఉపయోగపడతాయి.కాలేయ పనితీరు బాగా చురుకుగా ఉండటానికి చైనీయులు రేగి పండ్ల టానిక్ ని ఉపయోగిస్తారు.

Advertisement

జపనీయుల పరిశోధనలో రోగ నిరోధక శక్తిని పెంచుతుందని తెలిసింది.రక్తాన్ని శుభ్రం చేస్తుంది.

ఆకలి లేమి, రక్తహీనత, నీరసం, గొంతునొప్పి వంటి సమస్యలకు ఉపశమనం కలిగిస్తుంది.నిద్ర లేమి సమస్యను తగ్గించటంలో రేగి పండ్లు సహాయపడతాయి.

జుట్టు ఆరోగ్యంగా,ఒత్తుగా పెరగటానికి కూడా బాగా సహాయపడతాయి.ముఖ్యమైన విషయం ఏమిటంటే బాగా పండిన రేగి పండ్లను మాత్రమే తినాలి.

అలాగే మితంగా తినాలి.

తాజా వార్తలు