Suriya Singam 4 : సింగం 4 కి సిద్ధమవుతున్న సూర్య.. అభిమానులకు పండగే?

కోలీవుడ్ స్టార్ హీరో సూర్యకు కేవలం తమిళంలో మాత్రమే కాకుండా తెలుగులో కూడా ఎంతో మంది అభిమానులు ఉన్నారు.

ఇతను నటించిన గజిని సింగం సినిమాలు తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.

ఇకపోతే డైరెక్టర్ హరి దర్శకత్వంలో సూర్య పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించిన చిత్రం సింగం.ఈ సినిమా తెలుగులో యముడు పేరుతో విడుదలైంది.

అయితే అనంతరం సింగం 2 సింగం 3 పేరిట తెలుగులో కూడా సినిమాలు విడుదల అయ్యి విపరీతంగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.ఈ సినిమాలలో సూర్య పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఎంతో అద్భుతంగా నటించడమే కాకుండా ఇలా పోలీస్ ఆఫీసర్ గా సూర్య లుక్ సైతం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

ఇలా సింగం సిరీస్ లో ఇప్పటికే మూడు రాగా త్వరలోనే సింగం ఫోర్ కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తోంది.ఇప్పటికే డైరెక్టర్ హరి సింగం 4 సినిమాకు సంబంధించిన స్టోరీ లైన్ వినిపించడంతో అది నచ్చిన సూర్య ఈ కథను డెవలప్ చేయమని చెప్పారట.

Advertisement

ప్రస్తుతం డైరెక్టర్ హరి ఈ సినిమా స్క్రిప్టు సిద్ధం చేసే పనిలో ఉన్నారు.

ఇకపోతే త్వరలోనే ఈ సినిమా గురించి అధికారకంగా ప్రకటన కూడా రాబోతుందని తెలుస్తోంది.ఈ విధంగా సూర్య పోలీస్ ఆఫీసర్ పాత్రలో సింగం 4 సినిమా ద్వారా మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారని తెలియడంతో అభిమానుల సైతం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ప్రస్తుతం ఈయన డైరెక్టర్ శివ దర్శకత్వంలో పిరియాడిక్ డ్రామాగా తెరకెకపోతున్న సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

ఈ సినిమా భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు.ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన పోస్టర్స్ సినిమాపై భారీ అంచనాలు పెంచాయి.

రజనీకాంత్ తెలుగు సినిమాల్లో నటించకూడదని ఎందుకు నిర్ణయం తీసుకున్నాడు
Advertisement

తాజా వార్తలు