అమ్మ అప్పు తీర్చడానికే హీరో అయ్యాను.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సూర్య!

కోలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న సూర్యకు(Suriya )తెలుగులో కూడా అదే స్థాయిలో అభిమానులు ఉన్నారని చెప్పాలి.

ఈయన నటించిన గజిని సినిమా తెలుగులో విడుదలయ్యి ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది.

ఈ సినిమా సమయం నుంచి సూర్య నటించిన సినిమాలన్నీ తెలుగులో కూడా విడుదలవుతూ ఇక్కడ మంచి ఆదరణ సొంతం చేసుకున్నాయి.ఇక సూర్య సినిమా వస్తుందంటే తెలుగులో కూడా అభిమానులు పెద్ద ఎత్తున థియేటర్లను ముస్తాబు చేస్తూ ఉంటారు.

ఇక త్వరలోనే సూర్య హీరోగా నటించిన కంగువ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది.

పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఈ సినిమాపై కూడా భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి.ఇదిలా ఉండగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సూర్య తన సినీ కెరియర్ గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.నిజానికి తాను సినిమా ఇండస్ట్రీలోకి రావాలని ఎప్పుడూ అనుకోలేదు వ్యాపార రంగంలోకి వెళ్లాలని అనుకున్నాను నాన్న పెట్టుబడి పెడితే ఏదైనా వ్యాపారం చేయాలనుకున్నాను.

Advertisement

కానీ అమ్మ చేసిన అప్పు నన్ను నేడు హీరోగా మీ ముందు నిలబెట్టింది అంటూ ఈయన ఆసక్తికరమైన విషయాన్ని బయట పెట్టారు.

తన తండ్రి సినిమా ఇండస్ట్రీలో కొనసాగిన తనకు సినిమాలలో నటించాలని ఆసక్తి ఉండేది కాదు.తాను డిగ్రీ చదువుతున్న సమయంలో ఓ బట్టల దుకాణంలో పనిచేస్తూ నెలకు 300 రూపాయలు సంపాదించే వాడిని.నాన్నకు తెలియకుండా అమ్మ 25 వేల రూపాయల అప్పు చేసిందని విషయం నాకు తెలియడంతో కంగారు పడ్డాను.

ఆ సమయంలో డైరెక్టర్ మణిరత్నం గారు మా ఇంటికి వచ్చి ఆయన  సినిమాలో నన్ను నటించమని కోరారు.ఇష్టం లేకపోయినా అమ్మ చేసిన అప్పు గుర్తుకు వచ్చి తాను మణిరత్నం గారు చేసిన నెరుక్కుర్ నేర్ అనే సినిమాలో సెకండ్ హీరోగా చేశాను.

ఫస్ట్ హీరోగా విజయ్ సినిమా చేశారు.ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో అమ్మ అప్పు తీర్చేసాను అలాగే సినిమాలపై కూడా ఆసక్తి పెరిగి నేడు మీ ముందు ఇలా ఉన్నానంటూ ఇంట్రెస్టింగ్ విషయాన్ని బయటపెట్టారు.

కెనడా : భారత సంతతి యువతి మరణంపై ముగిసిన దర్యాప్తు.. ఏం తేల్చారంటే?
Advertisement

తాజా వార్తలు