తెలుగు సినిమా ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్( Character artist ) గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటి సురేఖ వాణి ( Surekha Vani ) ఒకరు.
ఈమె క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో అద్భుతమైన సినిమాలలో అక్క పిన్ని వదిన పాత్రలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు.
ఈ మధ్యకాలంలో సురేఖ వాణి సినిమాలలో నటించడం పూర్తిగా తగ్గించారని తెలుస్తుంది.ఈమె సినిమా అవకాశాలు రాక సినిమాలకు దూరంగా ఉన్నారో తెలియదు కానీ ఈ మధ్యకాలంలో పూర్తిగా సినిమాలకు దూరమవుతున్నారని మాత్రం తెలుస్తుంది.
ఇక సురేఖ వాణి సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటున్నారు.కరోనా సమయంలో అందరూ పూర్తిగా ఇంటికే పరిమితం కావడంతో ఆ సమయంలో ఈమె ఇంస్టాగ్రామ్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు అయితే ఇన్స్టాగ్రామ్ వేదికగా తన కుమార్తె సుప్రీతతో కలిసి సురేఖ వాణి చేస్తున్నటువంటి రచ్చ మామూలుగా లేదు ఇలా సోషల్ మీడియాలో పొట్టి పొట్టి దుస్తులు ధరించి రీల్స్ చేస్తూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేయడంతో ఈమెకు హీరోయిన్ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ లభించింది.
ఇలా సోషల్ మీడియాలో బిజీ అయినటువంటి ఈమె సినిమాలకు కాస్త దూరం అవుతూ వచ్చారు.
ఇక ప్రస్తుతం పలు సినిమాలు షోలలో సందడి చేస్తున్నారు.ఇకపోతే సురేఖ వాణి సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండు తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు.తాజాగా ఈమె సోషల్ మీడియా వేదికగా ఎరుపు రంగు చీర కట్టుకొని దిగినటువంటి ఫోటోని అభిమానులతో పంచుకున్నారు.
ఈ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.ఇక ఈ ఫోటోలో ఈమె మెడలో తాళి వేసుకోవడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు.
సురేఖ వాణి భర్త సురేష్ తేజ ( Suresh Teja ) 2019వ సంవత్సరంలో అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మరణించారు అనే విషయం మనకు తెలిసిందే.ఇలా తన భర్త మరణించినప్పటి నుంచి ఈమె తన కుమార్తెతో కలిసి ఉంటున్నారు.అయితే ఈమె రెండో పెళ్లి చేసుకుంటుంది అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చినప్పటికీ ఈమె మాత్రం ఈ వార్తలను ఎప్పటికప్పుడు తిప్పికొడుతూ వచ్చారు.
అయితే తన కుమార్తె సుప్రీత ( Supritha ) మాత్రం తన అమ్మ చేసుకుంటాను అంటే నాకు ఎలాంటి అభ్యంతరం లేదని కూడా తెలియజేశారు.ఈ విధంగా సురేఖ వాణి రెండో పెళ్లి గురించి తరచూ వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఈమె ఏకంగా మెడలో తాళిబొట్టుతో కనిపించడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు.
అదేంటి సురేఖ వాణి భర్త చనిపోయిన మెడలో తాళి ఉంది కొంపతీసి రెండో పెళ్లి చేసుకున్నవా ఏంటి అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు.అయితే మరి కొందరు మాత్రం ఏదైనా షో కోసం ఈమె వేసుకొని ఉంటుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
సెలెబ్రెటీలకు సినిమాలలో నటించే సమయంలో ఇలాంటివన్నీ సర్వసాధారణమే అని చెప్పాలి.ప్రస్తుతం ఈమె షేర్ చేసినటువంటి ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy