టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి ఎంతో మంచి గుర్తింపుసంపాదించుకున్నటువంటి నటి సురేఖ వాణి ( Surekha Vani )గురించి చెప్పాల్సిన పనిలేదు.
ఈమె ఎన్నో సినిమాలలో పిన్ని, వదిన పాత్రలలో ఎంతో అద్భుతంగా నటించి ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు.
అయితే ఈ మధ్యకాలంలో ఈమెకు కాస్త సినిమా అవకాశాలు తగ్గిపోయాయని తెలుస్తుంది.ఈ విధంగా ఈమెకు సినిమా అవకాశాలు తగ్గిపోవడంతో ఈమె సోషల్ మీడియా వేదికగా ఎంతో యాక్టివ్ అవుతూ తన కుమార్తెతో కలిసి పెద్ద ఎత్తున సందడి చేస్తున్నారు.
ఈ సందర్భంగా సురేఖ వాణి తన కుమార్తె సుప్రీత ( Supritha )తో కలిసి నిత్యం పార్టీలకు వెళ్లడం పబ్బులకు వెళ్లడం అలాగే ఇంస్టాగ్రామ్ రిల్స్ ద్వారా ఎప్పటికప్పుడు అభిమానులను సందడి చేస్తుంటారు.అయితే కొన్నిసార్లు వీరి వ్యవహార శైలి కారణంగా తీవ్ర స్థాయిలో ట్రోల్స్ ఎదుర్కొన్నప్పటికీ మాకసలు సంబంధం లేదన్న ధోరణిలో ఈ తల్లి కూతుర్లు వ్యవహరిస్తూ ఉంటారు.ఇక వీరిద్దరూ తరచూ పలు వెకేషన్ లకు వెళుతూ తమ జీవితాన్ని ఎంతో ఎంజాయ్ చేస్తూ ఉన్నారు.
ఈ క్రమంలోనే ప్రస్తుతం ఈ తల్లి కూతుర్లు ఇద్దరు కూడా అమెరికా( America ) వెకేషన్ లో ఉన్న విషయం మనకు తెలిసిందే.
ఈ వెకేషన్ కి సంబంధించిన ఫోటోలు వీడియోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు.అయితే అమెరికా వెకేషన్ లో లో ఉన్నటువంటి సురేఖ వాణి తన కుమార్తె సుప్రీతకు ఒక బిగ్ సర్ప్రైజ్ ఇచ్చి తనని సంతోషపరిచారు.ఇంతకీ ఏం జరిగిందనే విషయానికి వస్తే మరి కొద్ది రోజులలో సుప్రీత పుట్టినరోజు ( Birthday ) రానుంది.
ఈ క్రమంలోనే సురేఖవాణి అమెరికాలోని టైం స్క్వేర్ పక్కన ఉన్న హోర్డింగ్ లో సుప్రీత తన తండ్రితో కలిసి ఉన్నటువంటి ఫోటోని డిస్ ప్లే చేస్తూ తనకు అడ్వాన్స్ గా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.ఇలా తన తల్లి తనకు బిగ్ సర్ప్రైజ్ ఇవ్వడంతో అది చూసిన సుప్రీత ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా వేదికగా తన తల్లికి కృతజ్ఞతలు తెలిపారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy