వివేకా హత్య కేసులో సీబీఐ, ఏపీ ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది.

కేసు విచారణను మరో రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ ఆయన కుమార్తె సునీతా రెడ్డి పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

మూడేళ్లు కిందట హత్య జరిగినా.ఇప్పటివరకు కేసులో ఎలాంటి పురోగతి లేదని కోర్టుకు వివరించారు.

విచారణకు తోడ్పాటు అందించాలని ఏపీ హైకోర్టు ఉత్తర్వులు ఉన్నా.దిగువస్థాయి పోలీస్ యంత్రాంగం సహకరించడం లేదని సునీతా రెడ్డి తరపు న్యాయవాది తెలిపారు.

ఈ నేపథ్యంలో వాదనలు విన్న ధర్మాసనం సీబీఐకి, రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.ఈ కేసుకు సంబంధించిన వివరాలు తెలపాలని పేర్కొంది.

Advertisement

అనంతరం తదుపరి విచారణను అక్టోబర్ 14కి వాయిదా వేసింది.

ఏంది భయ్యో.. నీకంత పెద్ద యాక్సిడెంట్ జరిగినా.. అంత క్యాజువల్ గా నడుస్తున్నావ్?
Advertisement

తాజా వార్తలు