ఈనాడు రామోజీకి చుక్కలేనా ..? మార్గదర్శి కేసుపై సుప్రీం సంచలన నిర్ణయం

ఈనాడు సంస్థల అధినేత రామోజీరావుకు చెందిన మార్గదర్శి సంస్థ నిబంధనలకు విరుద్దంగా భారీగా డిపాజిట్లు సేకరించినట్టు ఆరోపణ.

ఈ కుంభకోణాన్ని ఉండవల్లి అరుణ్‌కుమార్ అప్పట్లో వెలుగులోకి తెచ్చారు.

కుంభకోణంపై విచారణ జరపాలని కోరారు.ఇందుకు స్పందించిన అప్పటి రాష్ట్ర ప్రభుత్వం విచారణ కోసం జీవో కూడా జారీ చేసింది.

అయితే వెంటనే రామోజీరావు హైకోర్టు ఆ తర్వాత, సుప్రీం కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు.అప్పటి నుంచి కేసు స్టే మీద ఉంది.

అయితే ముఖ్యమైన కేసులు ఏవైనా ఉంటే ఆరు నెలలకు మించి స్టే పొడిగించకూడదన్న సుప్రీం కోర్టు తీర్పుకు అనుగుణంగా ఇప్పుడు మార్గదర్శి వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది.స్టేను మరింత కాలం పొడిగించాలని రామోజీరావు కోరినా సుప్రీం కోర్టు అందుకు అంగీకరించలేదు.మార్గదర్శి వ్యవహారంపై స్పందన తెలియజేయాలని తెలంగాణ ప్రభుత్వానికి, ఉండవల్లి అరుణ్‌ కుమార్‌కి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది.

Advertisement
Advertisement