కాంతార 2 లో సూపర్ స్టార్..!

రిషబ్ శెట్టి నటించి డైరెక్ట్ చేసిన కాంతార సినిమా ప్రీక్వెల్ ప్లానింగ్ లో ఉన్న విషయం తెలిసిందే.కాంతార సినిమా అసలేమాత్రం అంచనాలు లేకుండా వచ్చి సెన్సేషనల్ హిట్ అందుకుంది.

16 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా 400 కోట్ల వసూళ్లను రాబట్టింది.నేషనల్ వైడ్ గా ఈ సినిమా ఒక సెన్సేషనల్ హిట్ సాధించింది.

ఇక కాంతర ఏర్పడిన క్రేజ్ తో కాంతార 2 కూడా ఎనౌన్స్ చేశాడు డైరెక్టర్ కం హీరో రిషబ్ శెట్టి. అయితే కాంతార 2 ప్రీక్వెల్ గా వస్తుందని టాక్.

అంతేకాదు ఈ సినిమాలో సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తారని అంటున్నారు.ఈ విషయాన్ని రిషబ్ దగ్గర ప్రస్తావించినా కూడా సైలెంట్ గా ఉన్నారట.అంటే కాంతార 2లో సూపర్ స్టార్ రజినీని చూసే అవకాశం ఉన్నట్టే లెక్క.

Advertisement

రిషబ్ శెట్టి కాంతార 2ని భారీగానే ప్లాన్ చేసినట్టు టాక్.ఈసారి బడ్జెట్ కూడా హ్యూజ్ గా పెట్టేందుకు రెడీ అవుతున్నారట.

కాంతార 2లో రజినీ కూడా ఉంటే మాత్రం ఆ లెక్క వేరేలా ఉంటుందని చెప్పొచ్చు.కాంతార 2లో మరిన్ని సర్ ప్రైజ్ లు ఉంటాయని తెలుస్తుంది.

సినిమా కథ ఇప్పటికే సిద్ధం కాగా కాస్టింగ్ ని ఫైనల్ చేసే పనిలో ఉన్నాడట రిషబ్ శెట్టి.

ఏంటి బాబులు హ్యాంగోవరా.. అయితే ఈ టిప్స్ మీకోసమే!
Advertisement

తాజా వార్తలు