ఐసీయూలో సూపర్ స్టార్ కృష్ణ..!

హైదరాబాద్ కాంటినెంటల్ ఆస్పత్రిలోని ఐసీయూలో సూపర్ స్టార్ కృష్ణకు చికిత్స కొనసాగుతోంది.నిన్న రాత్రి కృష్ణ స్వల్ప గుండెపోటుకు గురైనట్లు సమాచారం.

దీంతో ఆయనను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకువచ్చారు.వెంటనే ఆయనకు డాక్టర్లు సీపీఆర్ చేయడంతో కోలుకున్నారని తెలుస్తోంది.

అయితే గత కొద్ది రోజులుగా శ్వాస సంబంధిత సమస్యతో కృష్ణ బాధపడుతున్నారు.ప్రస్తుతం కృష్ణ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

మరోవైపు కృష్ణకు వైద్యులు మరిన్ని పరీక్షలు నిర్వహిస్తున్నారు.ఈ క్రమంలో మరికాసేపట్లో కృష్ణ ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్ విడుదల చేయనున్నారు.

Advertisement

ఈ నేపథ్యంలో ఫ్యాన్స్ ఎవరూ ఆందోళన చెందవద్దని, ఆస్పత్రి వద్దకు రావొద్దని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

సోమవారం రోజు ఈ మంత్రాలను పఠించడం వల్ల.. నయం కానీ రోగాల తో పాటు ఇంకెన్నో సమస్యలు దూరం..!
Advertisement

తాజా వార్తలు