మొండి చుండ్రును వదిలించే మ్యాజికల్ రెమెడీ ఇది.. ఒక్క వాష్ లోనే రిజల్ట్ అదిరిపోతుంది!

చుండ్రు( Dandruff ) అనేది అత్యంత సర్వసాధారణంగా ఇబ్బంది పెట్టే సమస్య.

ఫంగల్ ఇన్ఫెక్షన్, షాంపూను సరిగ్గా కడగకపోవడం, సెబమ్ యొక్క ఉత్పత్తి అధికంగా ఉండటం, చర్మం పొడిబారడం, వాతావరణంలో వచ్చే మార్పులు తదితర అంశాలు చుండ్రుకు కారణం అవుతుంటాయి.

చుండ్రు వల్ల తీవ్ర అసౌకర్యానికి గురవుతుంటారు.అందులోనూ ప్రస్తుత వేసవి కాలంలో చుండ్రు వల్ల తలలో విపరీతంగా దురద పుడుతుంది.

ఈ క్రమంలోనే చుండ్రును వదిలించుకునేందుకు రకరకాల షాంపూలు వాడుతుంటారు.

అయితే ఎన్ని షాంపూలు వాడినా కొందరిలో చుండ్రు పోదు.అలాంటి వారికి ఇప్పుడు చెప్పబోయే మ్యాజికల్ రెమెడీ చాలా బాగా సహాయపడుతుంది.ఈ రెమెడీ ద్వారా మొండి చుండ్రును సైతం వదిలించుకోవచ్చు.

Advertisement

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ గురించి తెలుసుకుందాం పదండి.ముందుగా రెండు ఉల్లిపాయలు( Onion ) తీసుకుని ముక్కలుగా కట్ చేసుకోవాలి.

ఈ ముక్కలను మిక్సీ జార్ లో వేసి మెత్తగా గ్రైండ్ చేసి జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ ఉల్లిపాయ జ్యూస్ లో హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం పొడి ( Ginger powder )వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.

చివరిగా వన్ టేబుల్ స్పూన్ ఆవనూనె, వన్ టేబుల్ స్పూన్ బాదం నూనె వేసుకుని మరోసారి కలుపుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని స్కాల్ప్ కు ఒకటికి రెండుసార్లు దూది సహాయంతో బాగా అప్లై చేసుకోవాలి.ఆపై షవర్ క్యాప్ ధరించాలి.

గంట అనంతరం తేలికపాటి షాంపూను ఉపయోగించి శుభ్రంగా తలస్నానం చేయాలి.ఉల్లిపాయ, అల్లం పొడి, ఆవ నూనె, బాదం నూనెలో ఉండే ప్రత్యేక గుణాలు చుండ్రుకు వ్యతిరేకంగా పోరాడుతాయి.

అమెరికా : వర్జీనియా డెమొక్రాటిక్ ప్రైమరీలో సుహాస్ సుబ్రహ్మణ్యం గెలుపు
త్రిష, నయనతారలను రష్మిక వెనక్కు నెట్టేసిందా.. ఆమె రెమ్యునరేషన్ ఎంతంటే?

చుండ్రును సమర్థవంతంగా నివారిస్తాయి.ఈ సింపుల్ రెమెడీని పాటిస్తే కేవలం ఒక్క వాష్ లోనే చాలా వరకు చుండ్రు పోతుంది.

Advertisement

రిజల్ట్ చూసి మీరే ఆశ్చర్యపోతారు.వారానికి ఒకసారి ఈ రెమెడీని పాటించారంటే చుండ్రుకు శాశ్వతంగా గుడ్ బై చెప్పవచ్చు.

పైగా ఈ సింపుల్ రెమెడీ వ‌ల్ల‌ హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది.జుట్టు ఒత్తుగా పొడుగ్గా పెరుగుతుంది.

మరియు జుట్టు కుదుళ్లు దృఢంగా ఆరోగ్యంగా సైతం మారతాయి.

తాజా వార్తలు