మొటిమలు తగ్గిన వాటి తాలూకు మచ్చలు పోవట్లేదా? అయితే ఈ రెమెడీ మీకే!

యుక్త వయసు ప్రారంభం కాగానే సర్వసాధారణంగా వేధించే సమస్యల్లో మొటిమలు( pimples ) ముందు వ‌ర‌స‌లో ఉంటాయి.అయితే కొందరికి మొటిమలు తగ్గిన.

వాటి తాలూకు మచ్చలు మాత్రం అలాగే ఉండిపోతాయి.మచ్చలు చర్మ సౌందర్యాన్ని తీవ్రంగా పాడుచేస్తాయి.

ఈ క్రమంలోనే మొటిమల తాలూకు మచ్చల‌ను వదిలించుకునేందుకు తోచిన ప్రయత్నాలు ప్రయోగాలు చేస్తుంటారు.మార్కెట్లో లభ్యమయ్యే క్రీమ్స్ ను కొనుగోలు చేసి వాడుతుంటారు.

అయినా సరే ఎలాంటి ఫలితం లేకుంటే ఏం చేయాలో తెలియక మదన పడుతూ ఉంటారు.మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే మీకు ఇప్పుడు చెప్పబోయే రెమెడీ చాలా బాగా సహాయపడుతుంది.మొటిమల తాలూకు మ‌చ్చ‌ల‌ను వదిలించడానికి ఈ రెమెడీని సమర్థవంతంగా పని చేస్తుంది.

Advertisement

అదే సమయంలో చర్మాన్ని కాంతివంతంగా సైతం మారుస్తుంది.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.

ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో రెండు రెబ్బల వేపాకు( Neem ), పది తులసి ఆకులు, అర కప్పు ఫ్రెష్ అలోవెరా జెల్( Aloe vera gel ) వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుండి జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు శనగపిండి, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి.

అలాగే ముందుగా తయారు చేసి పెట్టుకున్న జ్యూస్ ను మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్లు వేసుకోవాలి.

చివరిగా రెండు చుక్కలు టీ ట్రీ ఎసెన్షియల్ ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖం మొత్తానికి అప్లై చేసుకుని ఇరవై నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.ఆపై వాటర్ తో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.

జలుబు,దగ్గు, ముక్కు ఇన్ఫెక్షన్స్ ని ఇలా కంట్రోల్ చేయండి

రోజుకు ఒకసారి ఈ రెమెడీని కనుక పాటిస్తే మొటిమ‌ల తాలూకు మచ్చలే కాదు ఎలాంటి మచ్చలైన క్రమంగా మాయం అవుతాయి.క్లియర్ స్కిన్ మీ సొంతం అవుతుంది.

Advertisement

అదే సమయంలో చర్మం కాంతివంతంగా సైతం మెరుస్తుంది.కాబట్టి మొటిమల తాలూకు మచ్చలతో బాధపడుతున్న వారు తప్పకుండా ఈ రెమెడీని పాటించండి.

మంచి రిజల్ట్ మీ సొంతం అవుతుంది.

తాజా వార్తలు