మెడ, మోచేతుల నలుపు వదిలించుకోవాలా.. అయితే వెంటనే ఇలా చేయండి!

సాధారణంగా మనలో చాలా మందికి శరీరం మొత్తం ఒక రంగులో ఉంటే మెడ ( neck )మరియు మోచేతులు మాత్రం నల్లగా వేరు పాటుగా కనిపిస్తుంటాయి.

ఈ క్రమంలోనే మెడ మరియు మోచేతుల నలుపును వదిలించుకునేందుకు రకరకాల క్రీములు వాడుతుంటారు.

అయితే మార్కెట్లో లభ్యమయ్యే స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ వల్ల ఎంత ప్రయోజనం ఉంటుంది అన్నది పక్కన పెడితే.ఇప్పుడు చెప్పబోయే రెమెడీ మాత్రం చాలా పవర్ ఫుల్ గా పని చేస్తుంది.

రెగ్యులర్ గా ఈ రెమెడీని ఫాలో అయ్యారంటే మెడ మరియు మోచేతులను తెల్లగా మెరిపించుకోవచ్చు.మరి ఇంకెందుకు ఆలస్యం రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.

ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు రాగి పిండి( Ragi flour ), వన్ టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్( Coffee powder ) వేసుకోవాలి.అలాగే రెండు టేబుల్ స్పూన్లు ఫ్రెష్ లెమన్ జ్యూస్( Lemon juice ) మరియు రెండు టేబుల్ స్పూన్లు పెరుగు( curd ) వేసుకొని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు మీ మిశ్రమాన్ని మెడకు మరియు మోచేతులకు అప్లై చేసుకుని 20 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.

Advertisement

ఆ తర్వాత అర నిమ్మ చక్కని తీసుకుని మోచేతులు మరియు మెడను నాలుగు నుంచి ఐదు నిమిషాల పాటు బాగా రుద్దాలి.

ఆపై వాటర్ తో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకుని మంచి మాయిశ్చరైజర్ ను రాసుకోవాలి.ఈ విధంగా రోజుకు ఒకసారి కనుక చేస్తే మోచేతులు మెడ యొక్క నలుపు క్రమంగా మాయం అవుతుంది.రాగి పిండి, కాఫీ పౌడర్, పెరుగు, నిమ్మరసంలో ఉండే పలు సుగుణాలు చర్మాన్ని తెల్లగా మృదువుగా మార్చడంలో చాలా బాగా సహాయ పడతాయి.

చర్మం పై పేరుకుపోయిన మృత కణాలను తొలగిస్తాయి.కావాలి అనుకుంటే మీరు ఈ రెమెడీని వారానికి రెండు సార్లు ముఖంపై కూడా ప్రయత్నించవచ్చు.ఈ రెమెడీ ఫేస్ ను గ్లోయింగ్ గా మెరిపిస్తుంది.

స్కిన్ కలర్ ను ఇంప్రూవ్ చేస్తుంది.మరియు డ్రై స్కిన్ సమస్యకు చెక్ పెడుతుంది.

పెండింగ్ పనులు తోరగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
Advertisement

తాజా వార్తలు