ఎంపీ అవినాష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకి కౌంటర్ ఇచ్చిన సునీత..!!

వివేక హత్య కేసు గురించి ఎంపీ అవినాష్ రెడ్డి( MP Avinash Reddy ) నేడు మీడియా సమావేశం నిర్వహించి కీలక వ్యాఖ్యలు చేశారు.

ఈ కేసులో తన సోదరీ సునీత.

( Suneetha ) కావాలని కుట్రపూరితంగా వ్యవహరిస్తుందని ఆరోపణలు చేశారు.దస్తగిరిని సాక్షిగా మార్చి ఇతరులను ఇరికించాలన్నది.

ఆమె యొక్క ప్లాన్ అని చెప్పుకొచ్చారు.వివేకాను హత్య చేసినట్టు దస్తగిరి ఇప్పటికే ఒప్పుకున్నారు.

దస్తగిరి( Dastagiri ) అప్రూవర్ గా మారేందుకు సునీత ఒప్పందం చేసుకుందని వ్యాఖ్యానించారు.వివేక హత్యపై గతంలో సీబీఐ ( CBI ) ఎదుట స్టేట్ మెంట్ ఇచ్చిన సునీత తర్వాత వివేక రాసిన లేఖపై మాట మార్చిందని వ్యాఖ్యానించారు.

Sunita Countered Mp Avinash Reddy Comments Details, Ys Suneetha, Mp Avinash Redd
Advertisement
Sunita Countered MP Avinash Reddy Comments Details, Ys Suneetha, MP Avinash Redd

ఈ క్రమంలో ఎంపీ అవినాష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సునీత స్పందించారు.దస్తగిరి అప్రూవర్ అయినంత మాత్రాన తప్పించుకునే అవకాశం లేదని పేర్కొన్నారు.కేసు దర్యాప్తు ఆలస్యం అవుతుందని అవినాష్ అంటున్నారు.

మరి దీని గురించి ఆయన పోలీసులతో ఎప్పుడైనా మాట్లాడారా.? ప్రతి విషయాన్ని రాజకీయం చేస్తే ఎలా.? గూగుల్ టేక్ అవుట్ ఫ్యాబ్రికేటెడ్ కాదు అని సునీత తనదైన శైలిలో కౌంటర్లు ఇచ్చారు.గత ఎన్నికల సమయంలో వైఎస్ వివేకానంద రెడ్డి( YS Vivekananda Reddy ) హత్యకు గురి కావటం జరిగింది.2019 ఎలక్షన్స్ సమయంలో జరిగిన ఈ హత్య తెలుగు రాజకీయలలో సంచలనం సృష్టించింది.దాదాపు 5 సంవత్సరాల నుండి ఈ హత్య కేసుకు సంబంధించి విచారణ జరుగుతుంది.

Advertisement

తాజా వార్తలు