'పుష్ప' లో సునీల్ లుక్‌.. వాళ్లను మించి పోయాడుగా!

అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్నా హీరోయిన్ గా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప సినిమా చిత్రీకరణ ముగింపు దశకు వచ్చేసింది.

భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమాలో సునీల్‌ విలన్ పాత్రలో కనిపించబోతున్నట్లుగా మొదటి నుండి వార్తలు వస్తున్నాయి.

రవితేజ నటించిన డిస్కో రాజా సినిమాలో సునీల్‌ కొద్ది సమయం విలన్ గా కనిపించాడు.కలర్ ఫొటోలో కూడా విలన్ పాత్రలో కనిపించి మెప్పించాడు.

అందుకే పుష్ప లో ఆయన విలనిజం ఎలా ఉంటుందో చూడాలని చాలా మంది ఎదురు చూస్తున్నారు.సుకుమార్ ఏ రేంజ్ లో విలన్‌ లను చూపిస్తాడో రంగస్థలంలో జగపతిబాబు పాత్రను చూసిన తర్వాత అర్థం అయ్యింది.

అందుకే ఆయన దర్శకత్వం లో సునీల్‌ విలన్‌ అనగానే అంచనాలు భారీగా వచ్చాయి.కాని కొందరు సునీల్ అభిమానులు మాత్రం ఇప్పటి వరకు కూడా ఆయన్ను విలన్ గా చూస్తామని అనుకోవడం లేదని భావిస్తూ వచ్చారు.

Advertisement
Sunil Look In Allu Arjun Sukumar Pushpa Movie, Sunil Look , Allu Arjun , Sunil

నేడు అన్ని ప్రశ్నలకు సమాధానాలు లభించాయి.

Sunil Look In Allu Arjun Sukumar Pushpa Movie, Sunil Look , Allu Arjun , Sunil

పుష్ప సినిమా లో సునీల్‌ విలన్ గా నటిస్తున్న విషయం కన్ఫర్మ్‌.పుష్ప ను ఢీ కొట్టబోతున్న పాత్రలో సునీల్‌ కనిపించబోతున్నాడు.సునీల్‌ లుక్ ను విడుదల చేసి ఎంతటి పవర్ ఫుల్‌ గా ఆ పాత్రను చూపించబోతున్నారో చెప్పకనే చెప్పారు.

పుష్ప లో సునీల్ పాత్ర పేరు మంగళం శ్రీను.స్మగ్లర్ గా కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది.అల్లు అర్జున్‌ మరియు సునీల్‌ ల మద్య ఉండే సన్నివేశాలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా ఉంటాయనే నమ్మకంను ఇండస్ట్రీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు.

భారీ ఎత్తున అంచనాలున్న పుష్ప సినిమా లో సునీల్ పాత్ర ఉండే తీరు.లుక్ ను చూస్తే సినిమా మరో రేంజ్ లో ఉండబోతుంది అనిపిస్తుందని అల్లు అభిమానులు అంటున్నారు.

వారంలో 2 సార్లు ఈ రెమెడీని ట్రై చేస్తే మెడ న‌లుపు మాయం!

పుష్ప లుక్‌ కే ఫిదా అవుతున్న నెటిజన్స్ ఇప్పుడు సునీల్‌ లుక్ తో సుకుమార్‌ కు దండం పెడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు