వైసీపీ, టీడీపీలపై సునీల్ దియోధర్ హాట్ కామెంట్స్

వైసీపీ ల్యాండ్ మాఫియా పార్టీగా మారిందని ఏపీ బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి సునీల్ దియోధర్ అన్నారు.

అనంతపురం జిల్లాలో మంత్రి ఉషశ్రీ చరణ్ కి అభివృద్ధిపై శ్రద్ధ లేదని ఆరోపించారు.

ఆమెకు భూ కబ్జాలపై మాత్రమే ఆసక్తి ఉందని విమర్శించారు.ఏపీ నుంచి పరిశ్రమలు అన్నీ వెనక్కి పోతున్నాయని మండిపడ్డారు.

రాష్ట్రంలో ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉందన్నారు.బాబు వస్తే జాబు అన్నారు.

కానీ కొడుక్కి మాత్రమే జాబు వచ్చిందని ఎద్దేవా చేశారు.వైసీపీ, టీడీపీ రెండూ కుల, కుటుంబ, అవినీతి పార్టీలని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

Advertisement

ప్రత్యేక హోదా చంద్రబాబు హయాంలోనే ముగిసిన అధ్యాయమని పేర్కొన్నారు.పవన్ తమతోనే ఉన్నాడని.

ఆయన చంద్రబాబుతో కలిసినా ఏమీ కాదని వెల్లడించారు.అదేవిధంగా నారా లోకేశ్ పాదయాత్ర వలన ఎటువంటి ఉపయోగం లేదని తెలిపారు.

Advertisement