హిట్టు కోసం సందీప్ కిషన్ అంత రిస్క్ చేశాడా..!

కుర్ర హీరోలేమో ఓ పక్క కొత్త కొత్త కథలతో సంచలన విజయాలను దక్కించుకుంటుంటే మరికొందరేమో ఆ హిట్ కోసం నానా తిప్పలు పడాల్సి వస్తుంది.

ప్రస్తుతం కృష్ణవంశీ డైరక్షన్లో నక్షత్రం సినిమా చేస్తున్న సందీప్ కిషన్ సినిమా కోసం చాలా రిస్క్ తీసుకుంటున్నాడట.

రన్, ఒక అమ్మాయి తప్ప సినిమాలతో ఫ్లాప్ ఫేజ్ చేసిన సందీప్ కిషన్ కృష్ణవంశీ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్నాడు.అందుకే ఈ సినిమా కోసం ఎంత రిస్కైనా పర్వాలేదు అని అనేస్తున్నాడట.

రీసెంట్ గా సినిమాలోని యాక్షన్ సీన్స్ కంప్లీట్ చేసుకున్న సందీప్ కిషన్ 150 కార్లు ఎదురుగా వస్తుండగా వాటిని తప్పించుకుని కార్ డ్రైవ్ చేశాడట.సినిమాలో హైలెట్ అవనున్న ఈ సీన్ కోసం డూప్ లేకుండా చేశాడట సందీప్ కిషన్.

మరి హిట్ కోసం ఇంత రిస్క్ తీసుకుంటున్న సందీప్ ఈసారైనా హిట్ మజా ఎంజాయ్ చేస్తాడేమో చూడాలి.రెజినా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో సాయి ధరం తేజ్,ప్రగ్యా జైశ్వాల్ స్పెషల్ రోల్స్ లో కనిపించనున్నారు.

Advertisement
నిన్ను పెట్టి సినిమా తీస్తే ఎవడైనా చూస్తాడా అంటూ తారక్ పై రాజమౌళి ఆగ్రహం