గల్లీ రౌడీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్..!

సందీప్ కిషన్ హీరోగా జి.నాగేశ్వర్ రెడ్డి డైరక్షన్ లో ఎం.

వి.

వి బ్యానర్ లో ఎం.వి.వి సత్యనారాయణ, కోనా వెంకట్ కలిసి నిర్మించిన సినిమా గల్లీ రౌడీ.ఈ సినిమాలో సందీప్ కిషన్ కు జోడీగా నేహా శెట్టి హీరోయిన్ గా నటించింది.

ఈమధ్యనే ఈ సినిమా కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చింది.అయితే ప్రేక్షకులను అలరించడంలో విఫలమైంది.

ఇక థియేటర్ లో టార్గెట్ మిస్సైన గల్లీ రౌడీ ఇప్పుడు ఓటీటీ ఆడియెన్స్ ను మెప్పించేందుకు వస్తుంది.ఈ సినిమాను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వారు పండుగ సందర్భంగా ఓటీటీ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.

Advertisement

నవంబర్ 4న దీపావళి కానుకగా గల్లీ రౌడీ సినిమా ఓటీటీ రిలీజ్ అవుతుంది.ఈమధ్య డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో తెలుగు సినిమాలు వరుసగా రిలీజ్ అవుతున్నాయి.

నితిన్ నటించిన మాస్ట్రో డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయ్యింది.ఆ సినిమాతో పాటుగా కొన్ని కొత్త సినిమాలు కూడా థియేటర్ రిలీజ్ తర్వాత డిస్నీ హాట్ స్టార్ లోనే వస్తున్నాయి.

ఇక లేటెస్ట్ గా సందీప్ కిషన్ గల్లీ రౌడీ కూడా డిస్నీ హాట్ స్టార్ లో దీపావళి సందర్భంగా రిలీజ్ అవుతుంది.కామెడీ ఎంటర్టైనర్ గా ఓటీటీ ఆడియెన్స్ ను గల్లీ రౌడీ అలరిస్తుందో లేదో చూడాలి.

పాకిస్థాన్ ఆర్మీ దారుణం.. మోదీని పొగిడిన యూట్యూబర్లను ఉరేసి చంపేసింది?
Advertisement

తాజా వార్తలు