సంవత్సరంలో మూడు రోజులే శివలింగంపై సూర్యకిరణాలు.. ఈ దేవాలయం ఎక్కడుందంటే..?

మన భారత దేశంలో ఎన్నో పురాతనమైన దేవాలయాలు, పుణ్యక్షేత్రాలు( Temples , shrines ) ఉన్నాయి.

మన దేశంలో ఉన్న ఆలయాలకు ఎన్నో అద్భుతమైన శక్తులు ఉన్నాయని ఈ ప్రజలు నమ్ముతారు.

అప్పటి రోజులలో దేవాలయ నిర్మాణంలో ఎంతో నైపుణ్యాన్ని ప్రదర్శించేవారు.మన దేశంలోనీ ఒక దేవాలయంలో సంవత్సరంలో కేవలం మూడు రోజులు మాత్రమే గర్భగుడిలోని శివలింగంపై పడే సూర్యకిరణాలు( sun rays ) పరమ శివుడి మహత్యం గా భక్తులు భావిస్తారు.

ఈ కిరణాలు కేవలం వినాయక నవరాత్రి ఉత్సవాల సమయంలో మాత్రమే పడుతున్నాయి.ఈ సూర్యకిరణాలు శివలింగంపై ఎలా పడుతున్నాయో అన్న ప్రశ్నకు ఇప్పటివరకు ఎవరి దగ్గర సమాధానం లేదు.

Sun Rays On Shiva Lingam Only Three Days In A Year Where Is This Temple , Swayam

ఈ సూర్యకిరణాలు చుట్టూ నాలుగు వైపులా గుట్టలు పడమటి ముఖ ద్వారం కలిగిన ఈ శివాలయంలో నేరుగా గర్భగుడిలోని శివలింగంపై వాలుతున్న సూర్య కిరణాలు స్వయంభూ శివలింగానికి పునశక్తిని ప్రసాదిస్తున్నాయి.అది కూడా కేవలం సంవత్సరంలో మూడు రోజులు మాత్రమే సూర్యకిరణాలు శివుని స్పర్శించి భక్తులను పులకించి పోయేలా చేస్తున్నాయి.1100 ఏళ్ల క్రితం హనుమకొండలో వెలసిన స్వయంభు సిద్దేశ్వరాలయంలో( Swayambhu Siddeshwar Temple ) ఈ విచిత్రం భక్తులను ఆశ్చర్యానికి గురిచేసింది.ఈ దేవాలయానికి ముందు భాగంలో నంది మండపం ఉంటుంది.

Advertisement
Sun Rays On Shiva Lingam Only Three Days In A Year Where Is This Temple , Swayam

దానికి ముందు ప్రధాన ద్వారం ఎంట్రెన్స్ ఆర్చి ఉంటుంది.దానికి ముందు పద్మాక్షి దేవాలయం గుట్ట ఉంటుంది.

దేవాలయానికి కుడివైపున హనుమద్గిరి కొండ,ఎడమ వైపు కాలభైరవ కొండ, వెనుక వైపున లక్ష్మీనరసింహ గుట్ట, ముందువైపు పద్మాక్షి ఆలయం గుట్ట ఉంటాయి.

Sun Rays On Shiva Lingam Only Three Days In A Year Where Is This Temple , Swayam

ఎటు చూసినా నాలుగు వైపులా గుట్టలు పైగా పడమటి ముఖ ద్వారం కలిగిన ఈ దేవాలయంలో సూర్య కిరణాలు పడే అవకాశం లేదు.మూడు ప్రధాన ద్వారాలు పూర్తిగా కిందకి ఉంటాయి.దేవాలయంలో పలికి వెళ్లే భక్తులు కూడా ఆ ద్వారాల వద్ద తలకూ తాగకుండా కిందకి వంగి లోపలికి వెళ్లాల్సి ఉంటుంది.

దేవాలయం ముందు భాగంలో నంది మండపం ఉండడం వల్ల ఎటువంటి పరిస్థితులలోను సూర్య కిరణాలు గర్భగుడిలో పడే అవకాశం లేదు.కానీ ప్రతి సంవత్సరం బాద్రపద మాసంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు జరిగే సమయంలో మాత్రమే ఈ విచిత్రం జరుగుతూ ఉంటుంది.సూర్యాస్తమయ సమయంలో సాయంత్రం 5.55 నిమిషముల నుంచి ఆరు గంటల మధ్య అంటే సరిగ్గా ఐదు నిమిషంలో పాటు సూర్యకిరణాలు నేరుగా శివలింగంపై పడి ఈ స్వయంభు శివలింగానికి పునశక్తిని ప్రసాదిస్తున్నాయి.

మలబద్ధకాన్ని తరిమికొట్టే బెస్ట్ డ్రింక్స్ ఇవి.. రోజు తీసుకుంటే మరెన్నో లాభాలు!
Advertisement

తాజా వార్తలు