పుష్పకు తలనొప్పిగా మారిన బ్యాక్‌డ్రాప్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పుష్ప’ ఇప్పటికే షూటింగ్ మొదలుపెట్టుకున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాతో మరోసారి బన్నీ సెన్సేషన్ క్రియేట్ చేయాలని చూస్తున్నాడు.

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ముచ్చటగా మూడోసారి బన్నీ నటిస్తుండటంతో, ఈ సినిమాతో వారు హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని చిత్ర యూనిట్ భావిస్తోంది.ఇక ఈ సినిమాను పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా సుకుమార్ తీర్చిదిద్దుతున్నాడు.

Sukumar Trouble With Location For Pushpa, Sukumar, Pushpa, Allu Arjun, Rashmika

ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్‌డ్రాప్‌తో రానున్న ఈ సినిమాలో బన్నీ ఓ లారీ డ్రైవర్ పాత్రలో నటిస్తున్నాడు.ఆయన పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్స్‌ను ఇప్పటికే రిలీజ్ చేశారు చిత్ర యూనిట్.

కాగా లాక్‌డౌన్ కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడిన సంగతి తెలిసిందే.అయితే ఇప్పుడు షూటింగ్‌లు మొదలవుతుండటంతో ‘పుష్ప’ చిత్ర షూటింగ్ కూడా మొదలుపెట్టాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.

Advertisement

బన్నీ కూడా దీనికి ఓకే అనడంతో, ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.కానీ ఈ సినిమా షూటింగ్‌ను ప్రారంభించే విషయంలో దర్శకుడు సుకుమార్‌కు పెద్ద తలనొప్పి వచ్చి పడింది.

ఈ సినిమా అడవి బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతుండటంతో ఇప్పుడు ఈ సినిమాను ఎక్కడ షూట్ చేయాలా అనే ఆలోచనలో పడ్డారట సుకుమార్.దీంతో ఈ సినిమా ఇప్పట్లో తిరిగి పట్టాలెక్కే ఛాన్స్ లేదని తెలుస్తోంది.

మొత్తానికి బన్నీ ‘పుష్ప’ చిత్రం ఎప్పుడు తెరకెక్కుతుందా అని అందరూ ఆసక్తిగా చూడాల్సిన పరిస్థితి నెలకొంది.

మొటిమలపై నిమ్మరసాన్ని ఈ 5 పద్ధతుల్లో ఉపయోగించాలి
Advertisement

తాజా వార్తలు