పుష్ప 2 కాదు పార్ట్ 3 కూడా..?

సుకుమార్ డైరక్షన్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన సూపర్ హిట్ మూవీ పుష్ప.

రెండు పార్టులుగా రిలీజ్ ప్లాన్ చేసిన పుష్ప పార్ట్ 1 ది రైజ్ అదిరిపోయింది.

పుష్ప ది రైజ్ సౌత్ లోనే కాదు నార్త్ లో కూడా సూపర్ హిట్ అయ్యింది.అక్కడ 100 కోట్లు కొల్లగొట్టిన రెండో తెలుగు హీరోగా అల్లు అర్జున్ పేరు మారుమోగింది.

పుష్ప పార్ట్ 1 ఏర్పరచిన అంచనాలు పార్ట్ 2 మీద ఎఫెక్ట్ అయ్యేలా చేశాయి.ఖచ్చితంగా పుష్ప పార్ట్ 2 అంచనాలను మించి ఉంటుందని అంటున్నారు.

అయితే లేటెస్ట్ గా సుకుమార్ పుష్ప కథని మరింత పొడిగించాలనే ప్లాన్ లో ఉన్నాడట.అదేంటి అంటే పుష్ప సినిమాను పార్ట్ 2తో ముగించకుండా పార్ట్ 3 కూడా ప్లాన్ చేస్తున్నాడట సుకుమార్.

Advertisement

పుష్ప రెండు పార్టులతోనే సుకుమార్ ముగిస్తాడని అనుకోగా పార్ట్ 3 కూడా ఉండటం ఆడియెన్స్ కి షాకింగ్ గా ఉంటుంది.అయితే పార్ట్ 3 పై చిత్రయూనిట్ నుండి అఫీషియల్ న్యూస్ రావాల్సి ఉంది.

పుష్ప పార్ట్ 1 తో అల్లు అర్జున్ కూడా పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. అసలు సినిమా ఏంటన్నది పుష్ప పార్ట్ 2లోనే ఉంటుందని చెబుతున్నారు.

మీరు 11 వ తారీఖున జన్మించారా....అయితే మీ లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసా?
Advertisement

తాజా వార్తలు