సుకుమార్ సినిమాకు ముందు, తర్వాత ఈ హీరోలు ఎలా ఉన్నారో తెలుసా.. ?

సినిమా రంగంలోకి ఎంతో మంది నటీనటులు, దర్శకులు వస్తుంటారు.పోతుంటారు.

కానీ కొందరే తమ సత్తా ఏంటో ప్రపంచానికి చాటుకుంటారు.

తమలోని ప్రత్యేకతను చాటి చెప్పి అందరి కంటే తాము ఎలా డిఫరెంటో వివరిస్తారు.

అలాంటి దర్శకులలో టాప్ లిస్టులో ఉండే డైరెక్టర్ సుకుమార్.టాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపుతో ముందుకుపోతున్నాడు ఈ లెక్కల మాస్టారు.

తన థీమ్, తన స్టైల్ డైరెక్షన్ తో జనాలను విపరీతంగా ఆకట్టుకుంటున్నాడు.అంతేకాదు.

Advertisement
Sukumar Heros Before And After Movie, Sukumar, Director Sukumar, Sukumar Movies,

మిగతా దర్శకులతో పోల్చితే సుమార్ సినిమా టేకింగ్ గానీ, హీరోల క్యారెక్టర్లు గానీ, వారి అప్పియరెన్స్ విషయంలోనూ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటాడు.తన సినిమాల్లో హీరోలు గతంలో ఎన్నడూ కనిపించని విధంగా కనిపించేలా చూసుకుంటాడు.

ఇంతకీ తన సినిమాల్లో హీరోలను ఎలా ప్రొజెక్ట్ చేశాడో ఇప్పుడు చూద్దాం.

రామ్- దేవదాస్, జగడం

Sukumar Heros Before And After Movie, Sukumar, Director Sukumar, Sukumar Movies,

రెండు సినిమాల్లో హీరోగా రామ్ నటించాడు.కానీ ఈ రెండు క్యారెక్టర్ల విషయంలో చాలా తేడా ఉంటుంది.దేవదాస్ తో ఇండస్ట్రీకి పరిచయం అయిన రామ్ ను .జగడం సినిమాకు వచ్చే సరికి కంప్లీట్ మాస్ క్యారెక్టర్ గా తీర్చిదిద్దాడు.

అల్లు అర్జున్- గంగోత్రి, ఆర్య

Sukumar Heros Before And After Movie, Sukumar, Director Sukumar, Sukumar Movies,

గంగోత్రి సినిమాలో ఏమాత్రం హ్యాండ్సమ్ గా కనిపించని అల్లు అర్జున్ ను ఆర్య సినిమాలో ఓ రేంజిలో స్టైల్ గా చూపించాడు.

అల్లు అర్జున్- ఆర్య, ఆర్య-2

టాలీవుడ్ లో హీరోలు వకీల్ సాబ్ లుగా నటించిన సినిమాలేంటో తెలుసా..?

ఆర్య సినిమాలో బన్నీని అందంగా చూపించిన సుకుమార్.ఆర్య-2కు వచ్చే సరికి మరిన్ని మెరుగులు దిద్దాడు.సాఫ్ట్ వేర్ ఉద్యోగిలా ఓ రేంజి క్లాస్ కుర్రాడి లుక్ లో కనిపించేలా చేశాడు.

జూనియర్ ఎన్టీఆర్- టెంపర్, నాన్నకు ప్రేమతో

Advertisement

టెంపర్ సినిమాలో కన్నింగ్ పోలీస్ గా మాస్ లుక్ లో కనిపించిన జూనియర్ ఎన్టీఆర్.నాన్నకు ప్రేమతో సినిమాకు వచ్చే సరికి చాలా స్టైలిష్ గా చూపించాడు.

మహేష్ బాబు- సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, నేనొక్కడినే

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో కూల్ గా కనిపించిన మహేష్ బాబును.నేనొక్కడినే సినిమాలో రాక్ స్టార్ గా మార్చేశాడు.

అల్లు అర్జున్- అల వైకుంఠపురంలో, పుష్ప

అల వైకుంఠపురంలో మాస్ అబ్బాయిలా కనిపించిన బన్నీ.పుష్ప సినిమాకు వచ్చే సరికి కలప స్మగ్లర్ క్యారెక్టర్ లో ఊరమాస్ లుక్ లో కనిపించేలా చేశాడు సుకుమార్.

రాం చరణ్- ధ్రువ, రంగస్థలం

ధ్రువ సినిమాలో ఐపీఎస్ పాత్రలో క్లాస్ లుక్ లో కనిపించిన రాం చరణ్.రంగస్థలం సినిమాకు వచ్చే సరికి పల్లెటూరి యువకుడిగా అదరగొట్టాడు.

నాగ చైతన్య- ఏమాయ చేసావె, 100% లవ్

ఏమాయ చేసావె సినిమాతో పోల్చితే 100% లవ్ సినిమాలో చైతు లుక్ పూర్తిగా మార్చేశాడు సుకుమార్.

తాజా వార్తలు