పార్లమెంట్ ముందు ఆత్మహత్య, క్రికెట్ బెట్టింగ్ వేసి

న్యూఢిల్లీలో అత్యధిక భద్రత మధ్య ఉండే పార్లమెంట్ ఎదుట ఓ వ్యక్తి చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టించింది.

నీలిరంగు చొక్కా, జీన్స్ ధరించిన ఓ వ్యక్తి మీడియా పార్కింగ్ కోసం ఉద్దేశించిన స్థలంలో ఉన్న చెట్టుకు ఉరేసుకుని ఉన్నాడని ఉదయం 7 గంటలకు పోలీసులు గుర్తించారు.

అతని పేరు రామ్ దయాళ్ వర్మ అని, వయసు 39 సంవత్సరాలని మధ్యప్రదేశ్ లోని శివపూర్ పట్టణం నుంచి వచ్చాడని ప్రాథమికంగా నిర్థారించినట్టు పోలీసులు తెలిపారు.క్రికెట్ బెట్టింగ్ లో తీవ్రంగా ఆయన నష్టపోయాడని, అందువల్లే ఆత్మహత్య చేసుకున్నట్టు, తను రాసిన 23 పేజీల లేఖలో రామ్ దయాళ్ పేర్కొన్నట్టు పోలీసులు తెలిపారు.

మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి కేసు దర్యాఫ్తు చేస్తున్నట్టు వెల్లడించారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – నవంబర్ 8, బుధవారం 2023
Advertisement

తాజా వార్తలు