కెరీర్ విషయంలో సుహాస్ జాగ్రత్త పడాల్సిందే.. కథల ఎంపికలో పొరపాట్లు చేస్తున్నారా?

చాలామంది హీరో, హీరోయిన్ లు కెరియర్ ప్రారంభంలో చేసే అతిపెద్ద మిస్టేక్ సినిమా అవకాశాలు ఎక్కువగా వస్తున్నాయని ఎగబడి తొందరపడి మరి ఆఫర్లను ఒప్పేసుకుంటూ ఉంటారు.

కానీ వాటి ఫలితం నిదానంగా కనిపిస్తూ ఉంటుంది.

అలా ఇప్పటికే చాలామంది నటీనటులు కెరియర్ ప్రారంభంలో కాస్త తొందరపడినప్పటికీ ఆ తర్వాత సినిమా అవకాశాల విషయంలో సినిమాల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు.ఇక సుహాస్ కు( Suhas ) సైతం ఇది అనుభవం అవుతోంది.

అందరూ దేవర హడావిడిలో పడ్డారు కానీ మొన్న శనివారం గొర్రె పురాణం( Gorre Puranam Movie ) రిలీజైన సంగతి చాలా మంది పట్టించుకోలేదు.

అసలు వచ్చిందనే విషయమే చాలామందికి తెలియదు.ట్రైలర్ లాంచ్ తో మొదలుపెట్టి విడుదల తేదీ దాకా సుహాస్ ఎక్కడా దీని ప్రమోషన్లలో పాల్గొనలేదు.రెండు మతాల మధ్య దోబూచులాటకు కారణమైన ఒక గొర్రెకు, జైల్లో ఖైదీకి ముడిపెట్టిన విధానం వినడానికి వైరెటీగా ఉన్నా తెరకెక్కించే క్రమంలో పడిన తడబాటు భరించలేని ప్రహసనంగా మారింది.

Advertisement

అసలే పబ్లిసిటీ లేక ఓపెనింగ్స్ రాలేదని ఒకపక్క నిర్మాత ఇదవుతుంటే టాక్ కూడా అంతంత మాత్రంగా ఉండటం ఫలితాన్ని డిజాస్టర్ గా మార్చేసింది.ఆ మధ్య శ్రీరంగ నీతులుకు( Sriranga Neethulu ) సైతం సుహాస్ కి ఇదే అనుభవం ఎదురయ్యింది.

ఓటిటిలో వచ్చేదాకా ఎవరికీ దాని ఊసే లేదు.

వచ్చే దసరాకు రాబోతున్న జనక అయితే గనక( Janaka Aithe Ganaka ) మీద సుహాస్ కు బోలెడు ఆశలు ఉన్నాయి.ఓవర్సీస్ హక్కులను కొన్నాడంటేనే నమ్మకం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.పైగా దిల్ రాజు పిల్లలు నెలకొల్పిన బ్యానర్.

సో మార్కెటింగ్ బ్రహ్మాండంగా జరుగుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.ఇలాంటి మూవీ వస్తున్న టైంలో గొర్రె పురాణం రావడం కరెక్ట్ కాదని భావించాడో లేక ఎలాగూ కంటెంట్ ఎలా ఉందో అర్థమై దూరంగా ఉన్నాడో తెలియదు.

నిజ్జర్ హత్య : ఆధారాలపై చేతులెత్తేసిన ట్రూడో .. భారత్‌దే విజయమన్న కెనడియన్ జర్నలిస్ట్
ఏపీలో ఉచిత బస్సు ప్రయాణం ఎప్పటి నుంచంటే ? 

ఇవి కాకుండా ఇతరత్రా కారణాలు ఏమైనా ఉన్నాయేమో లోగుట్టు పెరుమాళ్ళకెరుక.దీని తర్వాత తర్వాతి వరసలో కేబుల్ రెడ్డి, ఉప్పు కప్పురంబు, ఆనంద్ రావు అడ్వెంచర్స్ విడుదలకు రెడీ అవుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు