కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారా? అయితే వెంటనే ఈ అలవాట్లను మానేయండి..

ఈ మధ్యకాలంలో చాలా మంది కిడ్నీ సమస్యలతో( Kidney problems ) బాధపడుతున్నారు.మనం ఆరోగ్యంగా ఉండాలంటే కిడ్నీ కూడా ఆరోగ్యంగా ఉండడం చాలా ముఖ్యం.

ఎందుకంటే మన శరీరంలో కిడ్నీ పాత్ర చాలా కీలకం.కాస్త దెబ్బ తిన్న ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

అయితే మన జీవనశైలిలో కొన్ని అలవాట్ల వల్ల కిడ్నీ సమస్యలు వస్తాయి.అయితే ఆ అలవాట్లకు దూరంగా ఉంటే కిడ్నీ సమస్యల నుండి బయటపడవచ్చు.

అయితే ఆ అలవాట్లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.చాలామంది తలనొప్పి, కాళ్లనొప్పి, ఒళ్ళు నొప్పులు ఉన్న వెంటనే పెయిన్ కిల్లర్స్( Pain killers ) వాడుతారు.

Advertisement
Suffering From Kidney Problems But Immediately Stop These Habits ,kidney Problem

అయితే పెయిన్ కిల్లర్స్ నొప్పిని తాత్కాలికంగా ఉపశమనం చేస్తాయి.అంతే మాత్రం మూత్రపిండాలకు ఇది మరింత హాని కలిగించవచ్చు.

ముఖ్యంగా కిడ్నీ వ్యాధి ఉంటే పెయిన్ కిల్లర్స్ అస్సలు వినియోగించకూడదు.డాక్టర్లు సూచించిన మోతాదుని వాడాలి.

అలాగే ఉప్పు ( salt )ఎక్కువగా ఉండే ఆహారాలను కూడా తీసుకోవడం మంచిది కాదు.ఎందుకంటే ఉప్పులో సోడియం అధికంగా ఉంటుంది.

Suffering From Kidney Problems But Immediately Stop These Habits ,kidney Problem

ఇది రక్తపోటును పెంచుతుంది.అలాగే మూత్రపిండాలను దెబ్బతీస్తుంది.ఆహారంలో ఉప్పుకు బదులుగా మూలికలు, సుగంధ ద్రవ్యాలు వాడితే మంచిది.

శ‌రీరంలో హిమోగ్లోబిన్ లెవ‌ల్స్ ను పెంచే పండ్లు ఇవే..!
రామ్ చరణ్ సక్సెస్ ఫుల్ లైనప్ ను సెట్ చేసుకున్నాడా..?

అదే విధంగా ప్రాసెస్ ఆహారం తీసుకోవడం కూడా మంచిది కాదు.ఎందుకంటే ఆహారాలలో సోడియం, ఫాస్ఫరస్ అధికంగా ఉంటాయి.

Advertisement

ఇక అతి ముఖ్యంగా కిడ్నీ వ్యాధి ఉన్నవారు వీటిని ఆహారంలో పరిమితం చేయాలి.ఇక కిడ్నీ వ్యాధి లేని వాళ్ళు కూడా ప్రాసెస్ చేసిన ఆహారాలు తీసుకుంటే మూత్రపిండాలు, ఎముకలు హానికరంగా మారుతాయి.

కాబట్టి ప్రాసెస్ ఆహారం తీసుకోవడం మంచిది కాదు.

వీలైనంతవరకు తగ్గించి తాజాకరమైన పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, పప్పులతో చేసిన ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి.అదేవిధంగా చాలామంది ఎక్కువగా నీరు తీసుకోరు.ఎక్కువగా నీరు తాగడం వల్ల మూత్రపిండాలు శరీరం నుండి సోడియం, టాక్సిన్స్ ను బయటకు పంపుతాయి.

అందుకే తగినంత నీరు తాగడం వల్ల కిడ్నీ సమస్యలు రావు.కిడ్నీ లో రాళ్లను కూడా నివారించవచ్చు.

తాజా వార్తలు