Sudigali Sudheer యెస్ సుధీర్ రీ ఎంట్రీ ఇచ్చేశాడు..!

జబర్దస్త్ నుంచి బయటకు వచ్చిన సుధీర్ ఆ వెంటనే స్టార్ మాలో సూపర్ సింగర్ జూనియర్స్ లో కనిపించగా సుధీర్ కూడా ఈటీవీకి హ్యాండ్ ఇచ్చాడని అనుకున్నారు.

కానీ సుధీర్ తను మల్లెమాల వారి ఆమోదం తోనే బయటకు వచ్చాడని తెలుస్తుంది.

ఇక లేటెస్ట్ గా మళ్లీ సుధీర్ ఈటీవీ షోకి వస్తాడని వార్తలు రాగా ఫైనల్ గా శ్రీదేవి డ్రామా కంపెనీలో కనిపించి అలరించాడు.అక్కడ రష్మితో సుధీర్ కలిసి హోస్ట్ చేయడం మళ్లీ ఆడియన్స్ కి ఉత్సాహాన్ని ఇచ్చింది.

సుధీర్ ఎనర్జిటిక్ యాంకరింగ్ తో ఈసారి శ్రీదేవి డ్రామా కంపెనీ మరింత క్రేజ్ తెచ్చుకోనుందని చెప్పొచ్చు.సుధీర్ రావడం రావడమే రాననుకున్నారా రాలేననుకున్నారా అంటూ ఓ భారీ డైలాగ్ తో ఆకట్టుకున్నారు.

సుధీర్, రష్మిల జోడీ తిరిగి జబర్దస్త్ ఎంటర్టైన్ మెంట్ అందించనుందని చెప్పొచ్చు.ఎలా వెళ్లాడో అలానే వచ్చడు సుధీర్.

Advertisement

మల్లెమాల టీం లో కొన్ని ఇబ్బందులు ఉన్నా ఇక్కడ కాన్ స్టంట్ గా పని ఉంటుంది.ఆ పనికి తగ్గ ప్రతిఫలం ఉంటుంది.

అది కాదనుకుని వెళ్లిన వారికి ఆర్ధిక ఇబ్బందులు తప్పవు.సుధీర్ అందుకే గోడకు కొట్టిన బంతిలా తిరిగి వచ్చాడని అనుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు