ఆమని పరువు తీసేసిన సుధీర్.. ఆమెలా కథలు చెప్పడం రాదులే అక్కా అంటూ?

బుల్లితెర కామెడీ షోలలో ఒకటైన ఎక్స్ట్రా జబర్దస్త్ షో మంచి టీఆర్పీ రేటింగ్ లను సొంతం చేసుకుంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే.

తాజాగా ఎక్స్ట్రా జబర్దస్త్ ప్రోమో రిలీజ్ కాగా ప్రోమోలో సుధీర్ ఆమని గాలి తీసేశారు.

రామ్ ప్రసాద్ రోజా ఒకవైపు సుధీర్ ఆమని మరోవైపు ఉండి ఎక్స్ట్రా జబర్దస్త్ లో స్కిట్ చేశారు.రోజా రామ్ ప్రసాద్ తో ఏంట్రా ఎందుకు పిలిచావ్ అని అడగగా వాళ్లు చూడు మనతో గొడవ పడుతున్నారని రామ్ ప్రసాద్ చెబుతాడు.

రోజా వెంటనే తొడగొట్టి ఎవడ్రా అది అని చెబుతారు.రోజా తొడగొట్టడంతో సెట్ లో ఉన్నవాళ్లంతా అవాక్కవుతారు.

రామ్ ప్రసాద్ రోజాతో అక్కా.! వాడు ఒక అడుగు వెనక్కు వేశాడంటూ సుధీర్ ను చూపిస్తూ చెబుతాడు.

Advertisement

ఆ తర్వాత సుధీర్ పులి ఒక అడుగు వెనక్కు వేసిందంటే పది అడుగులు ముందుకు వేస్తుందని చెప్పగా ఆ మాటలకు రోజా పకపకా నవ్వుతారు.సుధీర్ ఎందుకు నవ్వుతున్నారని అడగగా పులి గురించి పులిరాజు చెబుతుంటే నవ్వొచ్చిందని రోజా చెబుతారు.

ఆ తర్వాత ఆమని ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడిందంటా అని చెబుతుండగా ఈ సామెతలు కాదు ఇంకేదైనా చెప్పండని సుధీర్ కామెంట్ చేస్తారు.రోజా రామ్ ప్రసాద్ భుజం మీద చెయ్యి వేసి నువ్వు ఇటురా ఒక కథ చెబుతానంటూ ఒక ట్రైన్ ఇక్కడినుండి వెళుతోందని ఒక మనిషి ఇక్కడినుంచి వస్తున్నాడని ఈ ట్రైన్ వెళ్లి ఆ మనిషిని గుద్దేసింది.

ఇంకో కథలో ట్రైన్ ముందుకు వెళుతోందని మనిషి కూడా ముందుకే వెళుతున్నాడని రోజా చెబుతారు.

ఈ ట్రైన్ కూడా మనిషిని గుద్దేసిందని దీనిని బట్టి ఏం అర్థమైందని రోజా అడుగుతారు.రామ్ ప్రసాద్ వెంటనే ట్రైన్ ఎక్కాలంటే ఫ్లాట్ ఫామ్ ఎక్కాలి తప్ప పట్టాలు ఎక్కకూడదని అర్థమైందని వెల్లడించారు.ఆ తర్వాత ఆమని కూడా కథ చెప్పగా నీకు ఆమెలా కథలు చెప్పడం రాదులే అక్కా అంటూ సుధీర్ ఆమని పరువు తీసేశారు.

మీరు 11 వ తారీఖున జన్మించారా....అయితే మీ లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసా?
Advertisement

తాజా వార్తలు