మాజీ క్రికెటర్ నుంచి సర్ప్రైజింగ్ గిఫ్ట్ అందుకున్న సుదీప్.. ఊహించలేదంటూ ఎమోషనల్ పోస్ట్?

కన్నడ సూపర్ స్టార్ సుదీప్ కిచ్చా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈయన ఈగ సినిమాలో విలన్ పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులకు ఎంతో చేరువయ్యారు.

కన్నడ చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోగా గుర్తింపు సంపాదించిన సుదీప్ త్వరలోనే విక్రాంత్ రోణ అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.ఈ సినిమా జులై 28వ తేదీ ప్రేక్షకుల ముందుకురానుంది.

తాజాగా ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ విశేషంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.ఇక సుదీప్ కూడా ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు.

ఇలా సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా గడుపుతున్న సుదీప్ కి తన అభిమాన క్రికెటర్ నుంచి ఊహించని విధంగా బహుమానం రావడంతో ఈయన పట్టరాని సంతోషంలో ఉన్నారు.మరి ఆయన అభిమాన క్రికెటర్ ఎవరు ఆయన ఎలాంటి గిఫ్ట్ ఇచ్చారనే విషయానికి వస్తే ఆయన అభిమాన క్రికెటర్ మరెవరో కాదు ఇండియాకు మొట్టమొదటి ప్రపంచ కప్ సాధించి పెట్టిన కపిల్ దేవ్ కి సుదీప్ వీరాభిమాని.

Advertisement

ఈ విధంగా కపిల్ దేవ్ పై అభిమానం ఉండటంతోనే సుదీప్ కపిల్ బయోపిక్‌ 83 కన్నడ వెర్షన్ సినిమాను కర్ణాటకలో విడుదల చేశారు.ఇకపోతే కపిల్ దేవ్ 1983 వరల్డ్ కప్‌లో ఉపయోగించిన క్లాసిక్ బ్యాట్‌ను బహుమతిగా అందించి సుదీప్ ను సర్ప్రైస్ చేశారు.ఈ క్రమంలోనే సుదీప్ సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని తెలియజేస్తూ వాహ్.

వాట్ ఎ సండే.థాంక్ యూ కపిల్ దేవ్ సర్.ఇది ఊహించలేదు.ఇది క్లాసిక్ పీస్ ఆనందంలో తేలిపోతున్నట్టు ఉంది థాంక్యూ.

థాంక్యూ సో మచ్ అంటూ లవ్ ఎమోజీలను షేర్ చేశారు.ఇక ఈ బ్యాట్ పై 1983 వరల్డ్ కప్‌లో ఆడిన అందరి ఆటగాళ్ల సంతకాలు ఉండటం విశేషం.

 ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.

అందివచ్చిన అవకాశాన్ని ఈ ఇద్దరు హీరోయిన్స్ ఉపయోగించుకుంటారా ?
Advertisement

తాజా వార్తలు