నాడు అలా రాజ‌కీయాలు.. నేడేమో ఇలా.. కేసీఆర్‌లో ఎందుకింత మార్పు

రాజకీయాల్లో మంచి వ్యూహకర్తగా తెలంగాణ సీఎం కేసీఆర్‌కు పేరుంది.కాగా, తాజాగా సీఎం కేసీఆర్ రాజకీయాలు చేసే శైలిలో మార్పు వచ్చిందని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు.

ఆయన వ్యాఖ్యలు, చేతలను బట్టి ఈ మార్పు పరిశీలించొచ్చని అంటున్నారు.ఒకప్పుడు మాటలతోనే ప్రజలను తన వైపునకు తిప్పుకున టీఆర్ఎస్ పార్టీ అధినేత ఇప్పుడు స్కీమ్స్ అంటూ మనీ ఇస్తూ అధికార పార్టీ వైపు ప్రజలను మరలుస్తున్నారని చెప్తున్నారు.

రెండో సారి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కేసీఆర్ ఉప ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారని తెలుస్తోంది.ఈ క్రమంలోనే బై పోల్స్‌లోగెలిచేందుకు డబ్బులను విపరీతంగా ఖర్చు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

Such Politics Today Like Today Why Change In Kcr, Kcr, Politics,latest Tg News

అయితే, ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో ఆదాయం బాగానే ఉంది.కానీ, సీఎం కేసీఆర్ లోటు రాష్ట్రమైన విభజిత ఏపీతో పోటీ పడి మరీ అప్పులు చేస్తున్నారు.ఇకపోతే మాటలతో ప్రజలను ఆకట్టుకునే సీఎం కేసీఆర్ తాజాగా హుజురాబాద్ ఉప ఎన్నికలో గెలుపు కోసమే వ్యూహం మార్చారని అధికార పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది.

Advertisement
Such Politics Today Like Today Why Change In KCR, KCR, Politics,latest Tg News

ఉచిత పథకాల ద్వారా ప్రజలు ఇక కంప్లీట్‌గా తమ వైపే ఉంటారని భావించే కేసీఆర్ ఇలాంటి స్కీమ్స్‌కు రూపకల్పన చేస్తున్నారని విశ్లేషిస్తున్నారు.మొత్తానికి మాటల రాజకీయం కాస్తా చేతల దాకా ముఖ్యంగా డబ్బుల దాకా వెళ్లిందనే అభిప్రయాం పలు వర్గాల నుంచి వ్యక్తమవుతోంది.

హుజురాబాద్ ఉప ఎన్నికలో మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ను ఓడించేందుకే ఈ స్కీమ్ తీసుకొచ్చినట్లు బీజేపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి.అయితే, ఈటల ఈ స్కీమ్‌ను స్వాగతిస్తూనే తన గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేస్తుండటం విశేషం.

ఇక సీఎం సభ తర్వాత హుజురాబాద్ టీఆర్ఎస్ వర్గాల్లో జోష్ రాగా, అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ తరఫున ప్రచారం ఇంకా ముమ్మరం చేయనున్నట్లు సమాచారం.

Jyothamma Jabardast : మానవత్వం మర్చిపోయిన ఓ సమాజమా ..అగ్గి తో కడగాలి నిన్ను !
Advertisement

తాజా వార్తలు