శుభకార్యాల్లో భోజనాలు వడ్డించటానికి ఒక పద్దతి ఉందని మీకు తెలుసా?

శుభకార్యాలలో విందు భోజనానికి చాలా ప్రాముఖ్యత ఉన్న విషయం తెలిసిందే.శుభకార్యాన్ని జరిపేవారిని బంధుమిత్రులు వచ్చి పలకరించినప్పుడు భోజనాలు చేసి వెళ్లమని చెబుతుంటారు.

భోజనాలు బాగా వున్నాయని బంధుమిత్రులు అంటే ఇక ఆ శుభకార్యం విజయవంతం అయిందని భావిస్తారు.ఇక ఈ శుభకార్యాల్లో భోజనాలు వడ్డించే కార్యక్రమం చాలా సందడిగా కనిపిస్తుంటుంది.

ఒక్కొక్కరు ఒక్కో పదార్థాన్ని విస్తళ్లలో వడ్డిస్తూ వెళుతూ ఉంటారు ముందుగా పప్పు .చివర్లో మజ్జిగ అనే సూత్రం పైనే ఈ వడ్డన మొత్తం కొనసాగుతుంటుంది.అయితే మన పూర్వీకులు వడ్డన విషయంలో ఒక పద్ధతిని పాటిస్తూ వస్తున్నారు.

ఆ పద్ధతిని పరిశీలిస్తే .ఆహార పదార్థాలను వడ్డించడానికి వాళ్లు అరిటాకు శ్రేష్టమైనదిగా భావించారు.అరిటాకులో ముందుగా కూరలను వడ్డించిన తరువాత మధ్య భాగంలో అన్నంను వడ్డించాలి.

Advertisement

ముందే ఉత్త అన్నాన్ని వడ్డించడాన్ని శాస్త్రం తప్పు పడుతుంది.ఇక పప్పు .పాయసాలను అరిటాకు కుడి వైపున, పిండి పదార్థాలను ఎడమవైపున వడ్డించాలి.అతిథులు భోజనానికి కూర్చున్నప్పుడు వాళ్లు తినడం ప్రారంభించక ముందే నెయ్యి వడ్డించాలి .తినడం ప్రారంభించాక మాత్రమే ఉప్పును వడ్డించాలి.ఈ పద్దతులను పాటిస్తూ చేసే వడ్డన వల్లే ఫలితం దక్కుతుందని శాస్త్రాలు చెపుతున్నాయి.

వీడియో వైరల్ : ఏంటి రింకూ సింగ్ మరీ డబ్బులు అంత ఎక్కువయ్యాయ?
Advertisement

తాజా వార్తలు