నిర్మలపై మాజీ ఆర్థిక కార్యదర్శి సంచలన వ్యాఖ్యలు

కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌పై కేంద్ర ఆర్థిక కార్యదర్శి మాజీ కార్యదర్శి సుభాష్ గార్గ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఆమెతో పనిచేయడం చాలా కష్టమని వ్యాఖ్యానించిన ఆయన.

తాను స్వచ్చంధంగా రాజీనామా చేయడానికి ఆమె కారణమని ఆరోపించారు.తన బదిలీ కోసం నిర్మలా సీతారామన్ పట్టుబట్టారని సుభాష్ గార్గ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అధికార వర్గాల్లో సంచలనంగా మారాయి.

Subash Garg Sensational Comments On Nirmala Seetharaman,arun Jaitly,Finance Mini

అటు దివంగత నేత, మాజీ ఆర్థికశాఖ మంత్రి అరుణ్ జైట్లీపై సుభాష్ గార్గ్ ప్రశంసలు కురిపించారు.అరుణ్ జైట్లీ ఒక మాస్టర్ మైండ్ అని, ఆయనతో కలిసి పనిచేయడం చాలా ఆనందాన్ని ఇచ్చిందని స్పష్టం చేశారు.

విధానాల అమలు ఆయన కార్యదర్శులకే విడిచిపెట్టేవారని సుభాష్ గార్గ్ తెలిపారు.ఇక కేంద్ర ఆర్థికశాఖ నుంచి తాను బయటికి రావడానికి నిర్మతా సీతారమన్ కారణమని, తను బయటకు పంపించడంలో నిర్మల కీలకంగా వ్యవహరించారని పేర్కొన్నారు.

Advertisement

నిర్మలా వ్యక్తిత్వం వేరుగా ఉంటుందని, ఆమె విశ్వాసం చూపించలేకపోయారని సుభాస్ గార్గ్ ఆరోపించారు.నిర్మలా, తన మధ్య పనికి సంబంధించిన సత్సంబంధాలు ఉండేవి కాదని, తమ మధ్య కొన్ని విషయాల్లో బేధాభిప్రాయాలు వచ్చాయని సుభాస్ గార్గ్ చెప్పారు.

ఆర్‌బీఐ నిధులను ప్రభుత్వానికి ఇవ్వడం, బ్యాంకింగేతర సంస్థలకు ప్యాకేజీ లాంటి అంశాల్లో ఆమెకు, తన మధ్య బేధాభిప్రాయాలు వచ్చాయన్నారు.ఆర్థికశాఖ నుంచి విద్యుత్ శాఖకు తనను బదిలీ చేశారని, అది నచ్చక తాను రాజీనామా చేశానన్నారు.

ఆమెతో కలిసి పనిచేయడం మాత్రం చాలా కష్టంగా అనిపించిదన్నారు.

తాజా వార్తలు