హైదరాబాద్ నిజాం కాలేజీలో విద్యార్థుల ఆందోళన

హైదరాబాద్ నిజాం కాలేజీలో విద్యార్థినుల ఆందోళన కొనసాగుతోంది.హాస్టల్ బిల్డింగ్ డిగ్రీ విద్యార్థులకు కేటాయించాలని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమం చేపట్టారు.

గత పది రోజులుగా విద్యార్థినీల ఆందోళన సాగుతున్న విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో నిన్న విద్యార్థులను అధికారులు చర్చకు పిలిచారు.

పీజీ విద్యార్థులకు 50 శాతం, డిగ్రీ విద్యార్థులకు 50 ఇస్తామని హామీ ఇచ్చారు.అయితే బిల్డింగ్ ను పూర్తిగా డిగ్రీ విద్యార్థులకే కేటాయించాలని విద్యార్థులు కోరారు.

తమ మాట వినకపోతే అధికారులు క్రిమినల్ కేసులు పెడతామని బెదిరిస్తున్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు.చర్చలకు రమ్మని పిలిచి బెదిరించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.

Advertisement

సీఎం కేసీఆర్ ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

గ‌ర్భిణీల్లో విట‌మిన్ ఎ లోపం ఎన్ని అన‌ర్థాల‌కు దారితీస్తుందో తెలుసా?
Advertisement

తాజా వార్తలు