ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటాం : ఎస్పీ డా.వినీత్.జి ఐపిఎస్

సెప్టెంబర్ 4వ తేదీన సింగరేణి సంస్థలో ఉద్యోగుల భర్తీ ప్రక్రియలో నిర్వహించబోయే పరీక్షకు అభ్యర్థులు సింగరేణి సంస్థ వారు సూచించే నియమ నిబంధనలను పాటించాలని ఈ రోజు జిల్లా ఎస్పీ డా.

వినీత్.

జి ఐపిఎస్ ఒక ప్రకటనలో తెలిపారు.ఉద్యోగాల కోసం ఎదురుచూసే యువత అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకొని ఇప్పటికే కొంత మంది వ్యక్తులు ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి సులభంగా వారిని మోసం చేస్తున్నారని,అలాంటి వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఎవరైనా ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేసే ఉద్దేశ్యంతో తమ వద్దకు వస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు.ఈ విధమైన చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తుల గురించి ఎవరికైనా తెలిస్తే వెంటనే పోలీసువారికి సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.

అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని,మాయ మాటలు చెప్పి మోసాలకు పాల్పడే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేశారు.

Advertisement
8 ఏళ్ల వయసులో శవం తో కొన్ని గంటలు బంధింపబడ్డ హీరో ఇతనే..!

తాజా వార్తలు