తెలంగాణ ఎన్నికల బారాన్ని పూర్తిగా డీకే శివకుమార్( DK Sivakumar ) చేతుల్లోకి తీసుకున్నట్లుగా తెలుస్తుంది, కర్ణాటకలో కాంగ్రెస్ ( Congress in Karnataka )అధికారంలోకి రావడానికి సర్వం తానే అయ్యి వ్యవహరించిన శివకుమార్, ఒకపక్క భాజపా ప్రచార ప్రభంజనాన్ని తట్టుకుంటూ మరోపక్క జెడిఎస్ ఆశలను భగ్నం చేస్తూ కాంగ్రెస్ ను ఏకపక్షంగా అధికారం లోకి తీసుకొచ్చారు.
అంతేకాకుండా అనేకసార్లు గాంధీ కుటుంబానికి అత్యంత నమ్మకస్తుడిగా వ్యవహరిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వాలు నిలబడడానికి సహకరించారు .
దాంతో తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల బాధ్యతలను కూడా తీసుకోవాల్సిందిగా టెన్ జనపద్ నుంచి ఆదేశాలు వచ్చినట్లుగా తెలుస్తుంది .దాంతో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వరకు తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల ప్రచారాన్ని ,బూత్ లెవల్ కమిటీల ఏర్పాటు నుంచి ప్రచార శైలి వరకు సర్వం ఆయన దర్శకత్వంలోనే నడవబోతున్నట్లుగా తెలుస్తుంది.
ఇప్పటికే ఈ దిశగా తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి( Congress president Revanth Reddy ) తో సమావేశమైన డీకే తానుండడానికి అవసరమని ఏర్పాట్లు చేయవలసిందిగా ఆదేశించినట్లుగా వార్తలు వస్తున్నాయి.అభ్యర్థుల నియామకం దగ్గర నుంచి మేనిఫెస్టో రూపకల్పన వరకు ఇక డీకే మార్క్ కనిపించబోతున్నట్లుగా తెలుస్తుంది.ఇప్పటికే పార్టీ కీలక నేత లందరు శివకుమార్తో టచ్ లోనే ఉన్నందున ఇకపై ఆయన పాత్ర తెలంగాణ ఎన్నికల్లో మరింత బలంగా కనిపించబోతున్నట్లుగా తెలుస్తుంది.
ఏది ఏమైనా తన ఆర్థిక అండదండలతోనే కాకుండా సంక్షోభ సమయంలో తాను అమలు చేసిన వ్యూహాలు చూపిన చొరవకు కాంగ్రెస్లో ఒక ప్రత్యేక పవర్ సెంటర్ గా డీకే కే శివకుమార్ రెడ్డి ఏదిగారని చెప్పవచ్చు.కర్ణాటకా ఎన్నికలలో సర్వం తానే అయ్యి వ్యవహరించినా ముఖ్యమంత్రి పదవి దక్కనందుకు కొంత నిరాశ చెందినప్పటికీ గాంధీ కుటుంబం ఈయనకిస్తున్న ప్రత్యేక అధికారాలు బహుశా ఆయన సంతృప్తి పరిచినట్లు కనిపిస్తుంది.
గాంధీ కుటుంభం పట్ల విధేయత ఆయనకు అదనపు అర్హతగా మారింది .మరి ఇప్పటికే కొన్ని సర్వేలలో ముందంజలో ఉన్న కాంగ్రెస్ మరి డీకే మార్క్ వ్యూహాలు కూడా కలిస్తే ఖచ్చితంగా విజయ పదంలోకి నడుస్తున్న నడుస్తుందని కాంగ్రెస్ శ్రేణులు ఆశిస్తున్నాయి.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy