8 వ త‌ర‌గ‌తిలోనే అలాంటి చిత్రం .. ఈ హిట్ సినిమా హీరోయిన్‌ను గుర్తు ప‌ట్టారా..!

రింకు రాజ్‌. ప్రముఖ మరాఠా నటి.

ఇంకా ఈజీగా తెలియాలంటే సైరత్ మూవీ హీరోయిన్.

2016లో విడుదల అయిన ఈ సినిమా దేశ వ్యాప్తంగా సంచలనం సాధించింది.

అతి తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన సైరత్ మూవీ వసూళ్ల వర్షం కురిపించింది.ఈ సినిమా మూలంగా రింకుకు పుల్ పాపులర్ అయ్యింది.మరాఠాలోనే కాదు దేశ వ్యాప్త గుర్తింపు పొందింది.

ఈ సినిమాను ఆ తర్వాత కన్నడలో రీమేక్ చేశారు.ఈ మూవీకి మనసు మల్లిగే అనే పేరు పెట్టారు.

Advertisement

కన్నడలో ఓటీటీలో ఈ సినిమా రిలీజ్ అయ్యింది.అక్కడ కూడా సంచలన విజయం సాధించింది.

ఈ దెబ్బతో తను సౌత్ లోనూ పాపులర్ అయ్యింది.నిజానికి సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడం అనేది అంత ఈజీ కాదు.

ఒకవేళ వచ్చినా సక్సెస్ ఫుల్ గా ముందుకు సాగడం సాధ్యం అయ్యేపని కాదు.కానీ రింకు రాజ్ కు మాత్రం అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి.

ఎన్నో సినిమా క్యారెక్టర్లు తన కోసం వచ్చి ముందు ఆగాయి.ప్రస్తుతం ఆమె డిస్నీ స్టార్ వెబ్ సిరీస్ హండ్రెడ్ లో యాక్ట్ చేసింది.

ఆ ఒక్క సినిమా నా జీవితాన్నే మార్చేసింది... రష్మిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
తెలంగాణ కాంగ్రెస్ ప్రక్షాళన .. ఆమెనూ తప్పిస్తున్నారా ? 

రింకు రాజ్ మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లా అక్లుజ్ లో జన్మించింది.

Advertisement

ఆమె తల్లిదండ్రులు ఇద్దరూ టీచర్లు.చిన్నప్పుడు ఆమె చదువులో ముందు ఉండేది.ఆమెకు బ్రదర్ కూడా ఉన్నాడు.

సైరత్ మూవీ రిలీజ్ అయ్యే సరికి ఆమె కేవలం 9వ తరగతి చదువుతుంది.సినిమాల్లో బిజీగా ఉండటం మూలంగా ఆమె ట్యూషన్ పెట్టించుకుని చదివింది.

ఇంటర్ 82 శాతం మార్కులతో పాస్ అయ్యింది.

యానిమల్స్ అంటే తనకు ఎంతో ఇష్టం అందుకే తను వెటర్నిటీ డాక్టర్ చదువు పూర్తి చేసింది.అసలు తను సినిమాల్లో హీరోయిన్ గా చేస్తానని అస్సలు ఊహించలేదని చెప్పింది రింకూ.సైరత్ దర్శకుడు నాగరాజుతో పాటు తనది ఒకే ఊరి కావడంతో తనకు సినిమా అవకాశం వచ్చినట్లు చెప్పింది.

ప్రస్తుతం తను హండ్రెడ్ వెబ్ సిరీస్ లో లారా దత్తాతో కలిసి నటించడం సంతోషంగా ఉందన్నారు.

తాజా వార్తలు