పొట్టకూటి కోసం హోటల్లో పని చేశాడు.. ఇప్పుడు అతడి ఆస్తి 100 కోట్లకు పైమాటే..!!

సాధారణంగా ఒక చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయికి చేరుకోవాలంటే చాలా కష్టపడాలి.

ప్రస్తుతం ఉన్నత హోదాలో ఉన్న వారందరూ అలాంటి మామూలు పరిస్థితుల నుంచి వచ్చిన వారే.

సంకల్పం కృషి పట్టుదల కష్టం ఫలితంగా ఒకరు తాము ఊహించిన దానికంటే ఎక్కువ హోదాలకు వెళ్లిపోతుంటారు.ఒకప్పుడు తిండి కోసం బాధపడిన వారు నేడు కోట్లకు అధిపతులు అయి రాణిస్తున్నారు కూడా.

అలాంటి వారిలో భువన్ బామ్ మంచి ఉదాహరణగా నిలుస్తున్నాడు.ఇతడు మొదట హోటల్లో పని చేశాడు ఇప్పుడు వందల కోట్లు సంపాదించే అందరికీ ఇన్‌స్పిరేషన్‌గా నిలుస్తున్నాడు.

భువన్ బామ్( Bhuvan Bam ) 1994 జనవరి 22న వడోదర, గుజరాత్‌లో ( Vadodara, Gujarat )జన్మించారు.వారి కుటుంబం మరాఠీ మూలాలు కలిగి ఉంది.

Advertisement
Story About Bhuvan Bhaam , Bhuvan Bhaam , Vadodara, Gujarat, BB Ki Wines, YouTu

తరువాత, వారు ఢిల్లీకి వలస వెళ్లారు, అక్కడ భువన్ తన చదువును కొనసాగించారు.తిండికి డబ్బులు లేక రెస్టారెంట్‌లో కూడా పనిచేశాడు.2021లో దురదృష్టవశాత్తు, భువన్ తల్లిదండ్రులు కరోనావైరస్ వల్ల మరణించారు.దీనివల్ల అతడు మానసికంగా ఎంతో కృంగిపోయాడు.

జీవితంలో ఏదో ఒకటి సాధించాలనే ఉద్దేశంతో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాడు.

Story About Bhuvan Bhaam , Bhuvan Bhaam , Vadodara, Gujarat, Bb Ki Wines, Youtu

"బిబి కి వైన్స్"( BB Ki Wines ) అనే పేరుతో యూట్యూబ్‌లో వీడియోలు చేసి భువన్ బామ్ పేరు తెచ్చుకున్నారు.ఈ వీడియోలలో, అనేక ఫన్నీ పాత్రలను పోషించడం ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.బంచోడ్ దాస్, సమీర్ ఫుడ్డి, టిటు మామ, బబ్లు, జాంకీ, శ్రీమతి వర్మ, అద్రక్ బాబా, మిస్టర్ హోలా, పాపా మకిచు, డిటెక్టివ్ మాంగ్లూ, డాక్టర్ సెహగల్, బబ్లీ సర్ వంటి పాత్రలు చాలా ప్రాచుర్యం పొందాయి.

భువన్ బామ్ కేవలం ఒక కమెడియన్ మాత్రమే కాదు, గాయకుడు, నటుడు, రచయిత కూడా.

Story About Bhuvan Bhaam , Bhuvan Bhaam , Vadodara, Gujarat, Bb Ki Wines, Youtu
అక్కినేని ఫ్యామిలీ నుంచి స్టార్ హీరో రాలేడా..?
రాజమౌళి సినిమాలో చేయడానికి ఆర్టిస్టులు ఎందుకు ఉత్సాహాన్ని చూపిస్తారు...

యూట్యూబ్‌కి( YouTube ) పరిమితం కాకుండా, భువన్ బామ్ తన కథను టెడ్ టాక్స్ వేదిక ద్వారా ప్రపంచంతో పంచుకుని ఎంతో మందికి స్ఫూర్తినిచ్చారు.తన ప్రారంభ జీవితంలో, భువన్ భవిష్యత్తు గురించి చుట్టూ ఉన్నవారు ఆయన తల్లిదండ్రులను ప్రశ్నించేవారు.కానీ, భువన్ ఎవరేమనుకున్నా ఎంతమంది నిరుత్సాహపరిచిన తనకు చేసుకుంటూ ముందుకు సాగాడు.

Advertisement

చివరికి అందరినీ ఆకట్టుకున్నాడు.నటుడిగా, భువన్ "ప్లస్ మైనస్" అనే లఘుచిత్రంలో నటించి గుర్తింపు పొందారు.ఈ చిత్రంలో ఆయన నటి దివ్యా దత్తా తో కలిసి నటించారు.2023లో, "తాషా ఖబర్" ( Tasha Khabar ) అనే వెబ్‌సిరీస్‌లో కేవలం నటుడిగానే కాకుండా నిర్మాతగా కూడా పాల్గొన్నారు.ఈ షో భారీ విజయాన్ని సాధించింది, దీని రెండవ సీజన్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

తాజా వార్తలు