సవతి తల్లి చేతిలో 4 ఏళ్ల బాలుడు హతం.. అసలు కారణం అదే..!

భూమిపై తల్లి ప్రేమకు, సవతి తల్లి ప్రేమకు మధ్య తేడాకు నిదర్శనమే ఈ సంఘటన.కన్నతల్లి తన పిల్లల కోసం ప్రాణాలను అయినా పణంగా పెట్టేస్తుంది.

కానీ సవితి తల్లి( Step Mother ) ప్రేమ ఎలా ఉంటుందో చాలామందికి తెలుసు.ఓ సవితి తల్లి చెప్పుడు మాటలు విని ఏకంగా నాలుగు ఏళ్ల బాలుడిని నరబలి( Human Sacrifice ) ఇచ్చేసింది.

ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లోని( Uttar Pradesh ) అమేథిలోని జామే ప్రాంతంలో ఉండే రెహ్సీ అనే గ్రామంలో చోటుచేసుకుంది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.

రెహ్సీ గ్రామంలో ఆదివారం ఆడుకోవడానికి బయటకు వెళ్లిన 4 ఏళ్ల సత్యేంద్ర సోమవారం ఉదయం గ్రామ సమీపంలో ఉండే ఓ బావిలో శవమై కనిపించాడు.పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేసి బుధవారం ఆ బాలుడి సవతితల్లి రేణును, ఆమె తల్లి ప్రేమాదేవిను, ఆమె తండ్రి మంగ్రు ప్రజాతి ను, క్షుద్ర పూజారి దయారావ్ యాదవ్ లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

రెహ్సీ గ్రామంలో నివాసం ఉండే జితేంద్రను మొదటి భార్య విడిచిపెట్టి వెళ్ళిపోయింది.దీంతో ఏడాదిన్నర క్రితం మంగ్రు ప్రజాతి, ప్రేమాదేవిల కుమార్తె అయిన రేణును జితేంద్రకు ఇచ్చి వివాహం జరిపించారు.జితేంద్ర మొదటి భార్య కుమారుడు సత్యేంద్ర.

జితేంద్ర తో వివాహం జరిగిన తర్వాత రేణుకు అనారోగ్యం, గర్భస్రావం కావడంతో దయారామ్ యాదవ్ అనే క్షుద్ర పూజారిని కలిసి తమ సమస్యలకు పరిష్కారం చూపాలని కోరారు.

రేణుకు సంతానం కలగాలంటే జితేంద్ర మొదటి బిడ్డ సత్యేంద్రను బలి ఇవ్వాలని క్షుద్ర పూజారి తెలిపాడు.నిందితులు ఆ బాలుడుని నరబలి ఇచ్చేందుకు అంగీకరించారు.క్షుద్ర పూజలు జరిగిన ప్రదేశంలో నిమ్మకాయలు, జాజికాయలు లాంటి వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

తాజా వార్తలు